ETV Bharat / international

'కరోనా కట్టడిలో ఆక్స్​ఫర్డ్ టీకా భేష్​'

ఆక్స్​ఫర్డ్, అస్ట్రాజెనికా అభివృద్ధి చెసిన కరోనా టీకా అత్యంత సమర్థంగా పని చేస్తున్నట్లు ఓ అధ్యయం వెల్లడించింది. ఈ టీకా రెండు మోతాదుల్లో తీసుకోవాల్సిన ఉండగా.. మొదటి డోసే 67 శాతం వరకు వైరస్​ వ్యాప్తిని అడ్డుకోగలుగుతున్నట్లు తెలిపింది.

author img

By

Published : Feb 3, 2021, 5:12 PM IST

Oxford/AstraZeneca Vaccine Highly efficient
ఆక్స్​ఫర్డ్, అస్ట్రాజెనెకా టీకా సామర్థ్యం

రెండు మోతాదుల్లో తీసుకోవాల్సిన ఆక్స్​ఫర్డ్ 'ఆస్ట్రాజెనెకా' కరోనా వ్యాక్సిన్​ మొదటి డోసే.. వైరస్​ వ్యాప్తిని 67 శాతం నిరోధించగలుగుతున్నట్లు వెల్లడైంది. కొవిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో ఈ వ్యాక్సిన్​ సమర్థంగా పని చేస్తున్నట్లు ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయం తాజా అధ్యయనం పేర్కొంది.

ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ ట్రయల్​ ఫలితాలు 'లాన్సెట్​'లో ప్రచురించేందుకు ప్రస్తుతం సమీక్ష జరుగుతోంది. టీకా మొదటి డోసుకు, రెండో డోసుకు మధ్య మూడు నెలల వరకు సమయం ఉన్నా.. అప్పటి వరకు కరోనా సోకకుండా వ్యాక్సిన్​ సమర్థంగా పని చేస్తున్నట్లు ఈ పరిశోధనలో తెలిసింది.

భారత్​కు చెందిన సీరమ్​తో కలిసి ఉత్పత్తి చేస్తున్న.. ఆక్స్​ఫర్డ్/అస్ట్రాజెనెకా టీకా సింగిల్ స్టాండర్డ్​ డోస్​ 76 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు అధ్యయం తెలిపింది. ఈ టీకా మొదటి డోసు వేసుకున్న తర్వాత 22వ రోజు నుంచి 90వ రోజు వరకు దాని సామర్థ్యంలో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది.

"ఆక్స్​ ఫర్డ్ టీకా గురించి తెలిసిన వార్త నిజంగా చాలా అద్భుతం. మూడింట రెండొంతుల వ్యాప్తిని ఇది అరికట్టగలుగుతుంది. రెండు డోసుల మధ్య 12 వారాల గడువున్న ఏ ఒక్కరూ ఆస్పత్రిపాలుకాలేదు. ఈ వ్యాక్సిన్​ బాగా పని చేస్తోంది."

-మాట్​ హాంకాక్​, బ్రిటన్​ ఆరోగ్య మంత్రి

ఇదీ చదవండి:91 శాతం సమర్థంగా రష్యా వ్యాక్సిన్​: లాన్సెట్​

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.