ETV Bharat / international

హ్యూమన్​ ట్రయల్స్​లో ఆక్స్‌ఫర్డ్ టీకా ఫలితాలు ఆశాజనకం - ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిిన్​

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్​ ప్రయోగాల్లో ముందున్న ఆక్స్​ఫర్డ్​ టీకా​ సత్ఫలితాలనిస్తోంది. యువతతో పాటు వృద్ధుల్లోనూ ఈ వ్యాక్సిన్​ మెరుగైన వ్యాధినిరోధక శక్తిని పెంచుతున్నట్లు తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా సంస్థ ప్రకటించింది.

oxford vaccine
హ్యూమన్​ ట్రయల్స్​లో 'ఆక్స్‌ఫర్డ్ టీకా' ఆశాజనకం
author img

By

Published : Oct 26, 2020, 7:47 PM IST

ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకా.. వృద్ధులు, యువతలో ఒకేలాంటి రోగనిరోధక ప్రతిస్పందనను కలిగిస్తున్నట్లు వెల్లడైంది. అలాగే వృద్ధుల్లో ప్రతికూల స్పందన కూడా చాలా తక్కువగా ఉందని బ్రిటన్‌కు చెందిన ఔషధ సంస్థ ఆస్ట్రాజెనికా సోమవారం వెల్లడించింది.

"టీకా తీసుకున్న వృద్ధులు, యువతలో రోగనిరోధక ప్రతిస్పందన ఒకేలా ఉంది. కరోనా వైరస్ తీవ్ర ప్రభావం ఎదుర్కొంటున్న వయసు మళ్లిన వ్యక్తుల్లో ప్రతికూల చర్యలు చాలా తక్కువగా ఉండటం ప్రోత్సాహకరంగా ఉంది. అలాగే టీకా పూర్తిస్థాయి ఫలితాలు వస్తే రోగనిరోధకత, భద్రతపై మరింత స్పష్టత వస్తుంది"

-- ఆస్ట్రాజెనికా అధికార ప్రతినిధి

వైరస్‌ వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే వృద్ధుల్లో.. రక్షిత యాంటీబాడీలు, టీ సెల్స్‌ను వ్యాక్సిన్​ ప్రేరేపిస్తుందని ఇప్పటికే కొందరు పరిశోధకులు వెల్లడించారు. కరోనా వైరస్‌ విజృంభణ వల్ల కలవరపాటుకు గురైన ప్రపంచానికి ఆక్స్‌ఫర్డ్ టీకా ఆశాజనకంగా కనిపిస్తోంది. ఇప్పుడు అన్ని దేశాలు దాని తుది ఆమోదం కోసమే ఎదురుచూస్తున్న తరుణంలో సంస్థ ప్రకటన సానుకూల పరిణామం.

ఇదిలా ఉండగా.. బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మాట్‌ హాన్‌కాక్‌ బీబీసీతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి టీకా సిద్ధంగా లేదని, అయితే, దాని పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం చేస్తున్నట్లు తెలిపారు. అన్నీ సక్రమంగా జరిగితే, తాము అన్నింటికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

ఏప్రిల్‌లో ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఈ టీకా లైసెన్స్‌ను ఆస్ట్రాజెనికాకు ఇవ్వగా.. ఆ సంస్థ వివిధ దశలకు సంబంధించిన ప్రయోగాలను నిర్వహించింది. త్వరలో చివరిదశ ప్రాథమిక ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ సంస్థ తయారు చేస్తోన్న తొలివిడత టీకాను స్వీకరించడానికి సిద్ధంగా ఉండమని లండన్ హాస్పిటల్ ట్రస్ట్ సిబ్బందికి ఆదేశాలు అందినట్లు సోమవారం వార్తలు వచ్చాయి. నవంబర్‌ రెండవ తేదీ నుంచి ఆ స్వీకరణ ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే, ఆసుపత్రి వివరాలు మాత్రం వెల్లడికాలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.