ఎన్ని రకాల మొబైల్ ఫోన్లు ఉన్నా.. ఒకటే ఛార్జింజ్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ఐరోపా సమాఖ్య ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం ఓ చట్టాన్ని ప్రతిపాదించింది ఈయూ కమిషన్.
తాజా ప్రతిపాదన ప్రకారం.. ఫోన్ల ఛార్జింగ్ కోసం యూఎస్బీ-సీ కేబుల్‌ను మాత్రమే ఉపయోగించే విధంగా స్మార్ట్ఫోన్లను రూపొందించాలి. వాస్తవానికి ఐరోపాలోని అనేక స్మార్ట్‌ఫోన్ సంస్థలు ఇప్పటికే ఈ విధానాన్ని అమలుచేస్తున్నాయి. యాపిల్ నుంచి మాత్రం తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. యాపిల్ ఫోన్లకు ప్రత్యేకంగా ఛార్జింగ్ పోర్ట్‌లు ఉంటాయి.
ఐరోపా ప్రతిపాదన లక్షలాది మంది ప్రజలు హర్షిస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేబుల్స్ కోసం వెతుక్కోవడం పెద్ద పని అయిపోయినట్టు అంటున్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించుకునేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని ఐరోపా నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఐరోపావ్యాప్తంగా ఏటా 420 మిలియన్ మొబైల్ ఫోన్లు, పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలు అమ్ముడుపోతున్నాయి.
ఐరోపాలో నివాసముంటున్న వ్యక్తికి సగటున మూడు ఛార్జర్లు ఉంటున్నాయి. వీటిలో రెండు ఎప్పుడూ వాడుతున్నారు.
సరైన ఛార్జర్ వెంటనే లభించక.. ఒక్కోసారి ఛార్జింగ్ కూడా పెట్టుకోవడం లేదని ఐరోపాలోని 38శాతం మంది వెల్లడించారు.
"దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జర్ల అవసరం ఉంటోంది. పరికరాలు పెరిగే కొద్ది.. ఛార్జింగ్ విధానాలు మారిపోతున్నాయి. ఒకదానికి మరొకటి ఉపయోగించేందుకు కూడా కుదరడం లేదు. దీనికి మేము స్వస్తి పలుకుతున్నాము. మా ప్రతిపాదనతో.. ఐరోపాలో ప్రజలు ఎన్ని పరికరాలకైనా ఒకటే ఛార్జర్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనితో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కూడా తగ్గుతాయి. ప్రజలకు మరింత సులభమవుతుంది."
--- బ్రెంటన్, ఐరోపా ఇంటర్నల్ మార్కెట్ కమిషనర్.
ఈ ప్రతిపాదనపై యూరోపియన్ మార్కెట్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి ఆమోదం లభిస్తే.. ఐరోపాలో విక్రయించే ఫోన్లు, ట్యాబ్లెట్లు, డిజిటల్ కెమెరాలు, హెడ్ఫోన్లకు యూఎస్బీ-సీ ఛార్జింగ్ పోర్ట్ ఉండాల్సిందే.
ఇదీ చూడండి:- పవర్ 'బుల్' బ్యాంక్‌తో ఛార్జింగ్ కష్టాలకు చెక్