ETV Bharat / international

ప్రతి నలుగురిలో ఒకరికి వ్యాక్సిన్​ వద్దంట!

author img

By

Published : Sep 1, 2020, 10:45 PM IST

కరోనా టీకా వల్ల సైడ్​ఎఫెక్ట్స్​ కలుగాతాయేమో అన్న భయంతో.. ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ఒకరు వ్యాక్సిన్​ను తీసుకోవడానికి విముఖంగా ఉన్నారని ఓ సర్వే పేర్కొంది. అయితే వ్యాక్సిన్​ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న దేశాల్లో చైనా తొలి స్థానంలో ఉండగా.. బ్రెజిల్​, ఆస్ట్రేలియా, భారత్​ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

One in four adults globally do not want COVID-19 vaccination: WEF survey
కరోనా వ్యాక్సిన్​పై సుముఖంగా లేని ప్రజలు

కరోనా వ్యాక్యిన్​​ను తీసుకోవడానికి.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు విముఖంగా ఉన్నట్టు ఓ సర్వేలో తేలింది. టీకా వల్ల సైడ్​ ఎఫెక్ట్స్​ కలుగుతాయని వారిలో ఉన్న భయమే ఇందుకు కారణమని పేర్కొంది.

జులై 24 నుంచి ఆగస్టు 7 మధ్యకాలంలో.. 27 దేశాల్లోని 20వేల మందిపై వరల్డ్​ ఎకనామిక్​ ఫారం-ఐపీఎస్​ఓఎస్​ ఈ సర్వే నిర్వహించింది. అయితే.. ఈ ఏడాదే వ్యాక్సిన్​ వస్తుందని విశ్వసిస్తున్న దేశాల జాబితాలో భారత్​ మూడో స్థానంలో ఉంది. చైనా, సౌదీ అరేబియా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

అందుబాటులోకి వచ్చినప్పుడు కరోనా వ్యాక్సిన్​ను కచ్చితంగా తీసుకుంటామని.. ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాల్గొన్న 74శాతం మంది తెలిపారు. వ్యాక్సిన్​ కోసం ఎదురుచూస్తున్న వారిలో చైనా(97శాతం) ముందువరుసలో ఉంది. బ్రెజిల్​(88శాతం), ఆస్ట్రేలియా(88శాతం), భారత్​(87శాతం).. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు వ్యాక్సిన్​ ఎప్పుడొస్తుందా అని పట్టించుకోని దేశాల్లో రష్యా(54శాతం), పోలాండ్(56శాతం), హంగేరీ(56శాతం), ఫ్రాన్స్​(59శాతం) ముందువరుసలో ఉన్నాయి.

అదే సమయంలో ఈ ఏడాది వ్యాక్సిన్​ వస్తుందనే నమ్మకం లేదని సగానికిపైగా మంది(59శాతం) అభిప్రాయపడ్డారు. రానున్న నాలుగు నెలల్లో వైరస్​కు వ్యాక్సిన్​ వస్తుందని.. జర్మనీ, బెల్జియం, జపాన్​, పోలాండ్​ దేశాల్లోని ప్రతి నలుగురిలో ఒకరు- అంతకన్నా తక్కువమంది విశ్వసిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.