ETV Bharat / international

Uk Lockdown: బ్రిటన్​లో రెండు వారాలపాటు లాక్​డౌన్​?

Uk Lockdown: ఈ నెల చివర్లో రెండు వారాల పాటు సడలింపులతో కూడిన లాక్​డౌన్ విధించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం.

uk lockdown
బ్రిటన్ లాక్​డౌన్​?
author img

By

Published : Dec 18, 2021, 8:22 PM IST

Uk Lockdown: బ్రిటన్​లో కరోనా మహమ్మారి బీభత్సం సృష్టిస్తోంది. ఆ దేశంలో రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరోవైపు.. ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్​ కట్టడి కోసం ఈ నెల చివర్లో రెండు వారాలపాటు సడలింపులతో కూడిన లాక్​డౌన్ విధించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అక్కడి మీడియా ఆదివారం తమ కథనాల్లో తెలిపింది.

Uk omicron cases: ఇం​డోర్ సమావేశాలను రద్దు చేయడం సహా పబ్స్​, రెస్టారెంట్లను తక్కువ సామర్థ్యంతో నిర్వహించడం వంటి ఆంక్షలను విధించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని 'ది టైమ్స్'​ తన కథనంలో తెలిపింది. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్​.. లాక్​డౌన్​ కాకుండా తేలికపాటి నిబంధనలను అమలు చేసే విధంగా 'ప్లాన్ సీ'ని పరిశీలిస్తున్నారని 'ఫైనాన్షియల్ టైమ్స్' తెలిపింది. కరోనా కట్టడికి కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రులను శాస్త్రవేత్తలు హెచ్చరించారని 'బీబీసీ' చెప్పింది.

Britain coronavirus: బ్రిటన్​లో శుక్రవారం ఒక్కరోజే 93,045 కేసులు నమోదయ్యాయి. ఇది గురువారం నమోదైన కేసుల కంటే 4,669 అధికం. గురువారం బ్రిటన్​లో 88,376 కేసులు వెలుగు చూశాయి. బ్రిటన్​లోని చాలా ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్​ ప్రబలంగా ఉన్నప్పటికీ.. స్కాట్లాండ్​, లండన్ వంటి ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు.. బ్రిటన్​లోని వయోజనుల్లో సగానికిపైగా మంది ఇప్పటికే కొవిడ్ బూస్టర్​ డోసు తీసుకోవడం గమనార్హం.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.