ప్రయాణికులను ఎయిర్ లిఫ్ట్ ద్వారా రక్షించేందుకు చర్యలను చేపట్టినట్లు దక్షిణ నార్వే విపత్తు నిర్వాహక శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణం కారణంగా వైకింగ్ స్కై క్రూయిజ్ అనే నౌక ఇంజిన్ మొరాయించింది. సముద్రంలో వీస్తున్న బలమైన గాలుల వల్ల ముందుకు వెళ్లలేకపోతున్నామని ఓ అత్యవసర సందేశాన్ని పంపారు పడవలోని సిబ్బంది.
స్పందించిన నార్వే విపత్తు నిర్వాహక శాఖ సహాయక చర్యలకు ఆదేశించింది.
100 మందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా రక్షించినట్లు ప్రధాన పోలీస్ అధికారి ఫ్రాంక్ తెలిపారు.
పశ్చిమ నార్వేలోని మోర్ ఒగ్ రోమ్స్డల్ ప్రాంతానికి రెండు కిలో మీటర్లు దూరంలో పడవ నిలిచిపోయినట్లు తెలిపారు. అయితే అందులో ఉన్న అందరినీ రక్షించేందుకు కాస్త సమయం పట్టొచ్చని ఫ్రాంక్ తెలిపారు.
సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.