ఐరోపాలోని ఉత్తర మెసిడోనియా (North Macedonia) దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. కొవిడ్ చికిత్స అందించే ఆస్పత్రిలో మంటలు చెలరేగి (covid hospital fire) 10 మంది మరణించారు. ఘటనలో అనేక మంది గాయపడ్డారు.
టెటొవో నగరంలో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల కరోనా కేసులు (covid cases) భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. క్షతగాత్రులతో పాటు మరికొందరు రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు.
కారణం పేలుడే!
మంటలకు గల కారణాలు తెలియలేదు. అయితే, ఓ పేలుడు తర్వాత మంటలు సంభవించినట్లు ఆ దేశ ప్రధానమంత్రి (North Macedonia PM) జొరాన్ జాయెవ్ ఫేస్బుక్ పోస్ట్‌లో వెల్లడించారు.
ఆగస్టు నుంచి ఉత్తర మెసిడోనియాలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశ జనాభాలో 30 శాతం మందికి మాత్రమే రెండు డోసుల టీకాలు వేశారు.
ఇదీ చదవండి: పంజ్‌షేర్‌లో తాలిబన్ల మారణహోమం- ఐరాస స్పందించేనా?