ETV Bharat / international

మరో 28 రోజులు రిమాండ్​లోనే నీరవ్​ మోదీ​

రుణఎగవేతదారు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ రిమాండ్​ను మరో 28 రోజులు పొడిగించింది లండన్​లోని వెస్ట్​మినిస్టర్​ కోర్టు. లండన్​లోని వాండ్స్​వర్త్​ జైల్లో ఉన్న నీరవ్.. వీడియోలింక్ ద్వారా విచారణకు హాజరయ్యారు.​

Nirav Modi's remand extended in UK, final hearings in 2021
మరో 28 రోజులు రిమాండ్​లోనే నీరవ్​ మోదీ​
author img

By

Published : Dec 1, 2020, 8:50 PM IST

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్​ మోదీ రిమాండ్​ను మరో 28రోజులు వరకు పొడిగిస్తూ వెస్ట్​మినిస్టర్​ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డిసెంబర్​ 29 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు నీరవ్​. ప్రస్తుతం వాండ్స్​వర్త్​ జైలులో శిక్ష అనుభవిస్తున్న నీరవ్​.. వీడియో లింక్​ ద్వారా విచారణకు హాజరయ్యారు.

భారత్​కు అప్పగించే అంశంపై వచ్చే ఏడాది జనవరి 7, 8 తేదీల్లో తదుపరి విచారణ జరపనున్నట్లు కోర్టు పేర్కొంది. ఆయనను స్వదేశానికి రప్పించాలని భారత్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది.

ఇదీ చూడండి: ఆ నగరంపై దుండగులు దండయాత్ర- బ్యాంక్​ లూటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.