పరువు నష్టం కేసులో రష్యా ప్రతిపక్ష నేత అలెక్స్ నావల్నీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో దోషిగా తేల్చుతూ భారీగా జరిమానా విధించింది మాస్కో సిటీ కోర్టు. తనపై విధించిన జైలు శిక్షకు వ్యతిరేకంగా నావల్నీ దాఖలు చేసిన పటిషన్‌ను మరో న్యాయమూర్తి తిరస్కరించిన కొద్ది సమయానికే జరిమానా విధించటం ప్రాధాన్యం సంతరించుకుంది.
రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న నేతను దూషించినట్లు దాఖలైన పరువునష్టం కేసులో నావల్నీని దోషిగా తేల్చింది మాస్కో కోర్టు. 11,500 డాలర్లు (రూ.8,34,340)లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
గత ఏడాది క్రెమ్లిన్ అనుకూల వీడియోలో కనిపించిన 94 ఏళ్ల నేత, ఇతర వ్యక్తులపై ఆరోపణలు చేశారు నావల్నీ. అవినీతిపరులు, దేశద్రోహులుగా పేర్కొన్నారు. ఈనేపథ్యంలో నావల్నీపై పరువునష్టం కేసు నమోదైంది.
ఇదీ చూడండి: నావల్నీ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు