ETV Bharat / international

Mehul Choksi: కిడ్నాప్​పై ప్రియురాలి సంచలన వ్యాఖ్యలు - బార్బరా జబరికా

పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, వజ్రాల వ్యాపారి మెహుల్​ చోక్సీ కిడ్నాప్​లో తన పాత్ర ఏమీ లేదని స్పష్టం చేసింది అతడి ప్రియురాలిగా భావిస్తున్న బార్బరా జబరికా. అనవసరంగా తనను ఇరికిస్తున్నారని, అతనితో స్నేహం మాత్రమే కోరుకున్నానని తెలిపింది. క్యూబా పారిపోవాలని చోక్సీ ప్రణాళిక వేసుకున్నట్లు భావిస్తున్నానని చెప్పింది.

Barbara jabarica
బార్బరా జబరికా
author img

By

Published : Jun 9, 2021, 12:05 PM IST

పరారీలో ఉన్న భారత నగల వ్యాపారి మెహుల్​ చోక్సీ కిడ్నాప్​ ఉదంతంలో తన పాత్ర ఏమీ లేదని.. అతడి ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న బార్బరా జబరికా స్పష్టం చేసింది. చోక్సీ కిడ్నాప్​ అయినట్లు చెబుతున్న ఆంటిగ్వాలోని జూలీ హార్బర్​ ప్రాంతం చాలా సురక్షితమైనదిగా ఆమె చెప్పింది. జబరికా తనను వలలో ఇరికించి, కిడ్నాప్​నకు సహకరించిందంటూ చోక్సీ తాజాగా చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. ఈ వ్యవహారంపై ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో ఆమె స్పందించింది.

బార్బరా జబరికా కీలక వ్యాఖ్యలు

"చోక్సీ కిడ్నాప్‌ అయినట్లు చేబుతున్న ఆంటిగ్వాలోని జూలీ హార్బర్‌ ప్రాంతం చాలా సురక్షితమైనది. అక్కడ ఎవరు అపహరణకు గురయ్యే అవకాశమే లేదు. ఇప్పటి వరకు చోక్సీ అసలు పేరు మీడియాలో వచ్చే వరకు నాకు తెలియదు. భారత్‌లో అతని పూర్వ చరిత్ర తనకు తెలియదు. త‌న పేరును అన‌వ‌స‌రంగా చోక్సీ లాయ‌ర్లు, కుటుంబ స‌భ్యులు కిడ్నాప్‌ కేసులోకి లాగారు.

నేను చోక్సీ ప్రియురాలిని కాదని మరోసారి స్పష్టంగా చెబుతున్నా. అందరు అనుకుంటున్నట్టుగా ఆయన విలాసవంతమైన వస్తువులు ఇచ్చి నాతో డేటింగ్ చేయలేదు. ఇప్పటికీ చాలా మంది చోక్సీ ప్రియురాలిగా నా పేరు ప్రచారం చేస్తున్నారు. నా వ్యక్తిగత జీవితంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. నాకు సొంత ఆదాయం, వ్యాపారం ఉన్నాయి. అతని నగదు, హోటల్ బుకింగ్, నకిలీ ఆభరణాలు నాకు అవసరం లేదు.''

- బార్బరా జబరికా

క్యూబా పారిపోయేందుకు ప్లాన్​..

చోక్సీ క్యూబా పారిపోయే ప్రణాళికను బహిర్గతం చేసింది ప్రియురాలు జబరికా. ' పారిపోవటం, అలాంటి ప్రణాళికను నాతో ఎప్పుడూ పంచుకోలేదు. అయితే.. ఎప్పుడైనా క్యూబా వెళ్లావా అని రెండుసార్లు అడిగాడు. తర్వాత క్యూబాలో కలుసుకుందామని చెప్పాడు. డొమినికా ఆయన తుది గమ్యం కాదు. నన్ను అడిగితే.. క్యూబానే అతని చివరి గమ్యస్థానం. ' అని పేర్కొంది జబరికా.

BARBARA
బార్బరా జబరికా

విమాన టికెట్లు ఇవ్వజూపాడు..

తన కోసం చాలాసార్లు హోటల్​ గదులను బుక్​ చేసేందుకు ముందుకొచ్చాడని.. జబరికా చెప్పింది. విమాన టికెట్లనూ ఇవ్వజూపాడని, తాను మాత్రం తమ మధ్య కేవలం స్నేహాన్నే కోరుకున్నానని స్పష్టం చేసింది.

" చోక్సీతో నేను ఉదయపు నడకకు, కాఫీకి, రాత్రి భోజనాలకు వెళ్లేదాన్ని. నా అపార్ట్​మెంట్​కు కూడా అతడు వచ్చాడు. మా మధ్య సంబంధం.. స్నేహం, వ్యాపారానికి పరిమితమవ్వాలనే నేను ఎప్పుడూ కోరుకునేదాన్ని. అతడు మాత్రం నాకు హోటల్​ బిల్లులు, విమాన టికెట్ల రుసుములు చెల్లించేందుకు పదేపద్ ముందుకొచ్చేవాడు. నేను వాటిన్నింటినీ తిరస్కరించేదాన్ని. వాటి చెల్లింపుతో మా మధ్య సంబంధాన్ని అతడు అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఆంటిగ్వాలో చోక్సీ బొటిక్​ హోటళ్లు, క్లబ్​లు పెట్టాలనుకున్నాడు. నేను ప్రాపర్టీ సంబంధిత రంగంలో ఉండటంతో నాతో కలిసి వ్యాపారం చేసేందుకు ప్రయత్నించాడు. "

- బార్బరా జబరికా

రాజ్‌ అనే పేరుతో..

ఆంటిగ్వాలో చోక్సీ ఆరు నెలల్లో 6-8 ఫోన్‌ నంబర్లు మార్చాడని జబరికా పేర్కొంది. తన పేరును 'రాజ్‌'గా చెప్పుకొంటూ సందేశాలు పంపేవాడని చెప్పింది. ఆంటిగ్వా ప్రజలు, పలు రెస్టారెంట్ల సిబ్బంది అతణ్ని రాజ్‌ అనే పిలిచేవారని.. అతడి అసలు పేరు ఎవరికీ తెలియదని వివరించింది. . ప్పారు.

ఇవీ చూడండి: 'ఛోక్సీ భవిష్యత్తును తేల్చేది కోర్టులే'

Mehul Choksi: వేల కోట్లకు ట్రాప్ వేసిన అమ్మాయి!

భారత్​ నుంచి పారిపోలేదు: మెహుల్‌ చోక్సీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.