ETV Bharat / international

'అల'వోకగా గిన్నిస్‌ రికార్డు బద్దలు - Surfing new Guinness records

సర్ఫింగ్​లో తన రికార్డును తానే తిరగరాసింది బ్రెజిల్​కు చెందిన ఓ యువతి. 73.5 అడుగుల భారీ అలపై సర్ఫింగ్​ చేస్తూ ఔరా అనిపించేలా ఆమె చేసిన విన్యాసాలు చూపరులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్లను ఫిదా చేస్తున్న ఈ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది.

Maya Gaberia surfed the Guinnes World Record
'అల'వోకగా గిన్నిస్‌ రికార్డు బద్దలు
author img

By

Published : Sep 12, 2020, 8:44 PM IST

బ్రెజిల్‌కు చెందిన మాయా గబేరియా అనే యువతి సర్ఫింగ్‌లో తాను నెలకొల్పిన గిన్నిస్‌ రికార్డును తానే బద్దలు కొట్టింది. 73.5 అడుగుల అతిపెద్ద అలపై సర్ఫింగ్‌ చేయటం ద్వారా ఆమె ఈ ఘనత సాధించింది. అయితే.. ఇదివరకు ఉన్న 68 అడుగుల రికార్డు కూడా ఆమె నెలకొల్పిందే కావడం విశేషం.

మాయా సర్ఫింగ్​కు సంబంధించిన 40 సెకెన్ల వీడియో నెటిజన్లను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. నాలుగంతస్తుల భవనం కంటే ఎత్తైన అలపై మాయా చేసిన సర్ఫింగ్ విన్యాసాలు వీడియోలో నిక్షిప్తమయ్యాయి. దీనిని చూసి "వావ్‌.. అద్భుతం.. కంగ్రాట్స్‌.. వాట్​ ఎ థ్రిల్‌ మాయా..." అంటున్న వారి పొగడ్తలు సాగర ఘోషను మించిపోతున్నాయి. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి!

  • NEW RECORD: Largest wave surfed - unlimited (female) - 73.5 foot (22.4 metres). Congratulations to Brazil's Maya Gabeira 🌊🏄🏻‍♀️

    🎥 @wsl / Pedro Miranda pic.twitter.com/I71oqKYadS

    — GuinnessWorldRecords (@GWR) September 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: కదలకుండా 2 గంటలు.. రాత్రికి రాత్రి స్టార్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.