తనను భారత్‌కు తిరిగి పంపించేందుకు అనుమతిస్తూ బ్రిటన్ హోంశాఖ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలని లండన్ కోర్టును మరోమారు ఆశ్రయించారు లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా. రానున్న వారాల్లో మాల్యా అభ్యర్థనపై లండన్ కోర్టు విచారణ చేపట్టనుంది. మాల్యాపై ఆర్థిక మోసం, అక్రమ నగదు లావాదేవీ, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఉల్లంఘన వంటి పలు అభియోగాలు ఉన్నాయి.
మాల్యా కేసుల విచారణలో భాగంగా భారతదేశానికి పంపించాలని గత డిసెంబర్లో వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. ఫలితంగా బ్రిటన్ హోంశాఖ మాల్యాను భారత్‌కు పంపించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై తనకు అప్పీలు చేయడానికి అనుమతి ఇవ్వాలని ఇంతకుముందే మాల్యా లండన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 5న ఆ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. హైకోర్టు జడ్జి ఎదుట క్లుప్తంగా విచారణ చేపట్టడానికి అభ్యర్థన చేయాలనుకుంటే ఐదు పని దినాల్లోగా అప్పీల్ చేసుకోవాలని సూచించింది.
బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి విదేశాలకు పరారైన విజయ్‌మాల్యా 2017 ఏప్రిల్ నుంచి బ్రిటన్‌లో బెయిల్‌పై ఉన్నారు.
ఇదీ చూడండి: మాజీ సైనికాధికారుల 'లేఖ'పై దుమారం