భారత్‌లో వాయు కాలుష్యం నానాటికీ పెరుగుతోందని పరిశోధకులు గుర్తించారు. ప్రధానంగా దేశ రాజధాని దిల్లీతో పాటు కాన్పుర్‌లో కాలుష్య కారకాల స్థాయులు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధరించారు. ఉపగ్రహాలకు అమర్చిన సాధనాలతో 2005-2018 మధ్య ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సేకరించిన సమాచారాన్ని తాజా అధ్యయనంలో భాగంగా బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు విశ్లేషించారు.
ఆరోగ్యానికి హానికరమైన సూక్ష్మ ధూళికణాలు (పీఎం 2.5), నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయులు దిల్లీ, కాన్పుర్‌లలో ఎక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు. సొంత వాహనాల వినియోగం పెరగడం, పారిశ్రామికీకరణ, కాలుష్య నియంత్రణ విధానాలకు కట్టుబడి ఉండకపోవడం వంటివి కాలుష్య కారకాల పెరుగుదలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. దిల్లీ, కాన్పుర్‌తో పాటు లండన్‌లో హానికర ఫార్మాల్డిహైడ్ సమ్మేళనం అధికంగా ఉందని తెలిపారు.
ఇదీ చదవండి:బెయిలు లాంఛనాలు పూర్తి.. లాలూ ప్రసాద్‌కు విముక్తి