గుర్తుతెలియని సాయుధుడు కదులుతున్న బస్సుపై జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గాయపడ్డారు. ఐరోపా దేశమైన కొసోవోలో(kosovo country news) ఈ దారుణం వెలుగుచూసింది. రాజధాని ప్రిస్టినాకు(kosovo capital pristina) 90 కిమీ దూరంలో ఉన్న గ్లోగ్జాన్‌లో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ అక్కడిక్కడే మరణించగా.. గాయపడిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.
ఎనిమిది మందితో వెళ్తున్నఈ బస్సుపై ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఆటోమేటిక్ రైఫిల్‌తో కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే దాడికి గల కారణాలు తెలియదని పోలీసులు వివరించారు. "ఇది తీవ్రవాద చర్య అని నమ్మేందుకు ఆధారాలు లేవని" అని ఎల్షానీ అనే పోలీసు అధికారి చెప్పారు.
ఈ దాడి తనను 'షాక్'కు గురిచేసిందని అధ్యక్షుడు(kosovo president) వ్జోసా ఉస్మానీ తెలిపారు. వీలైనంత త్వరగా నేరస్థులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు.
మరోవైపు.. అల్బేనియా పర్యటనలో ఉన్న అంతర్గత వ్యవహారాల మంత్రి జిలాల్ స్వేక్లా(Xhelal Svecla) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇవీ చదవండి: