ETV Bharat / international

కొవిడ్​ మరణాల్లో బ్రిటన్​ను దాటిన ఇటలీ - కరోనా మరణాలు ఇటలీ

బ్రిటన్​తో పోల్చితే ఇటలీలో కరోనా మరణాల సంఖ్య అధికంగా ఉంది. యూకేలో ఇప్పటికే 64,267 మంది చనిపోగా.. ఇటలీలో 64,520 మంది కన్నుమూశారు.

Italy passes UK to have worst COVID-19 death toll in Europe
కొవిడ్​ మరణాల్లో యూకే ని దాటిన ఇటలీ
author img

By

Published : Dec 14, 2020, 5:46 AM IST

బ్రిటన్​లో నమోదైన కరోనా మరణాల లెక్కలతో పోల్చితే ఇటలీలో చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. యూకేలో 64,267 మంది చనిపోగా... ఇటలీలో 64,520 మంది మరణించినట్లు హాప్కిన్స్​ యూనివర్సిటీ తెలిపింది. వైరస్​ వ్యాప్తి మొదటి దశలో ఉన్నప్పుడు మరింత మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేసింది.

ఈ లెక్కలు ప్రభుత్వాన్ని కలవర పెడుతున్నాయి. ఈ క్రమంలో రానున్నది పండుగ సీజన్​ కావడం వల్ల వైరస్​ వ్యాప్తి మరింత విస్తరించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు సంబంధించి డిసెంబర్ 21 నుంచి జనవరి 6 వరకు ప్రయాణాలపై ఆంక్షలు విధించారు. అత్యవసర అవసరాలకు మినహా ప్రయాణాలు చేయకూడదని తెలిపింది. ఈ ప్రయాణ నియమాలలో కఠినంగా వ్యవహరించాలని చూస్తోంది అక్కడి ప్రభుత్వం.

తాజా లెక్కల ప్రకారం ఇటలీలో మరో 17,938కి వైరస్​ సోకింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 18లక్షల 30వేలను దాటింది.

ఇదీ చూడండి: ఐరోపాలో కరోనా మరణాల్లో వారే అధికం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.