ETV Bharat / international

24గంటల్లోనే పోయిన ముఖాకృతిని పొందొచ్చు! - త్రీడీ సాంకేతికత

ప్రమాదంలో విరిగిపోయిన ముఖం ఎముకల్ని సరిచేయడానికి గతంలో ఐదారురోజులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చేది. అయినా కూడా ముఖం ఆకృతి పూర్వ స్థితికి వచ్చేది కాదు. కానీ అధునాతన త్రీడీ సాంకేతికతను ఉపయోగించి వైద్యులు అద్భుతాలు చేస్తున్నారు. తక్కువ సమయంలోనే సర్జరీలు చేసి.. బాధితులు త్వరగా కోలుకునేలా చేస్తున్నారు.

ITALY 3D FACE RECONSTRUCTION
24గంటల్లోనే పోయిన ముఖాకృతిని పొందొచ్చు!
author img

By

Published : Feb 1, 2021, 8:29 AM IST

24గంటల్లోనే పోయిన ముఖాకృతిని పొందొచ్చు!

సాంకేతికత, మానవమేధస్సు కలబోతతో వైద్య రంగంలో కొత్త విప్లవానికి నాంది పలుకుతున్నారు నిపుణులు. త్రీడీ సాంకేతికత ఉపయోగించి 24 గంటల వ్యవధిలోనే ముఖానికి సర్జరీలు పూర్తి చేస్తున్నారు. ప్రమాదంలో విరిగిపోయిన ముఖం ఎముకలను తక్కువ సమయంలోనే సాధారణ స్థితి తీసుకొస్తున్నారు. ముందుగా కంప్యూటర్​ ద్వారా ముఖం ఆకృతిని తయారు చేసి.. ఆ తర్వాత టైటానియం ప్లేట్ల సాయంతో విరిగిన భాగాలను సరిగ్గా అమర్చుతున్నారు.

ITALY 3D FACE RECONSTRUCTION
పుర్రె త్రీడీ నమూనాను తయారుచేస్తోన్న ఆసుపత్రి సిబ్బంది

ఓ 23 ఏళ్ల యువకుడికి ఇదే తరహాలో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు ఇటలీ వైద్యులు. ప్రమాదంలో అతని ముఖం ఎముకలు విరిగిపోయాయి. చికిత్స కోసం అతన్ని టూరిన్​లోని సీటీఓ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం కంప్యూటర్​ స్క్రీన్​పై మీరు చూస్తోన్న పుర్రె నమూనా అతనికి సంబంధించిందే. ఆ నమూనే విరిగిన అతని ముఖం ఎముకల్ని అతికించడానికి సాయం చేసింది.

ITALY 3D FACE RECONSTRUCTION
కంప్యూటర్​పై పుర్రె త్రీడీ నమూనాలు

"విరిగిన ఎముకల్ని ఈ కంప్యూటర్​ తెరపై అతికించాము. యువకుడి ముఖం నమూనాకు అనుగుణంగా సరైన చిత్రాన్ని తయారుచేశాం. దాన్ని ప్రింట్​ తీశాం. ఈ త్రీడీ నమూనాకు కొన్ని పరికరాల సాయంతో విరిగిన భాగాల్ని అతికించాలి. శస్త్రచికిత్స చేసేటప్పుడు ఈ పథకాన్నే అమలు చేయాలన్నది మా ఉద్దేశం."

-ఇమ్మాన్యుయెల్​ జావట్టేరో, సర్జన్​, సీటీవో ఆసుపత్రి

సర్జరీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ రాత్రికి రాత్రే పూర్తి చేస్తారు వైద్యులు. అయితే ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి వీరికి ఆండ్రియా నోవరేసియో అనే ఇంజనీర్​ సహాయం అందించాడు.

"ఈ 2డీ​ పుర్రె చిత్రాన్ని త్రీడీకి మార్చడమే మా పని. ఈ పుర్రె త్రీడీ నమూనాని వైద్యుడు పరిశీలిస్తాడు. ఆ తరువాత పుర్రెలోని ఏ ఎముకలు విరిగాయో గుర్తిస్తాడు. కీలు భాగాల్ని సరైన చోట కుదిర్చి అంతిమ మోడల్​ను సిద్ధం చేస్తాం. ఇక్కడ పసుపు రంగులో కనిపించే భాగం చూడండి. దవడల్ని సరిగ్గా బిగించి పూర్వ స్థితికి తీసుకురావడాన్ని చూడొచ్చు. గతంలో ఆపరేషన్​ చేసేటప్పుడే మోడల్​ను తయారుచేసి రోగికి అమర్చేవారు. ఇప్పుడు త్రీడీ సాయంతో ముందుగా మోడల్​ను తయారు చేసుకుంటున్నాం. దీని వల్ల సమయం ఆదా అవుతోంది. అంతేకాక సర్జరీని విజయవంతంగా పూర్తిచేయవచ్చు."

-ఆండ్రియా నోవరేసియో, ట్యూరిన్​ పాలిటెక్నిక్​ విశ్వవిద్యాలయ విద్యార్థి

గతంలో కూడా ఇలాంటి ఆపరేషన్లు చేసేవారంటున్నారు సీటీఓ ఆసుపత్రి ముఖ శస్త్రచికిత్సల విభాగం డైరక్టర్​ గులేల్మో రమీరీ. అప్పుడు త్రీడీ సాంకేతికత వాడలేదు. కాబట్టి సర్జరీకి సిద్ధం కావడానికి 4-5 రోజులు పట్టేదని చెప్పారు.

"నిపుణులైన వైద్యులు, సాంకేతికతతో శస్త్రచికిత్సలు చేయాలని అనుకున్నాం. అందులో భాగంగానే ఈ త్రీడీ సాంకేతికతను వాడుతున్నాం. ఈ త్రీడీ సాంకేతికత విధానం వల్ల ఖర్చు తక్కువ అవుతుంది. అంతేకాకుండా కొన్ని గంటల్లోనే శస్త్రచికత్సను పూర్తి చేయవచ్చు. దాంతో ఎక్కువ మొత్తంలో ఆపరేషన్లు చేయవచ్చు."

-గులేల్మో రమీరీ, సీటీవో ఆసుపత్రి ముఖ శస్త్రచికిత్సల విభాగం డైరక్టర్

శస్త్రచికిత్స సరిగా పూర్తయిందా లేదా అని తెలుసుకోవడానికి ఆపరేషన్​ తర్వాత సిటీ స్కానింగ్​ని కంప్యూటర్​ త్రీడీ మోడల్​ నమూనాతో పోల్చి చూస్తారు. కాగా, 23 ఏళ్ల యువకుడు త్వరగా కోలుకుంటున్నాడని గులేమో రామీరీ స్పష్టం చేశారు. తొందరలోనే అతని ముఖం మామూలు స్థితికి వస్తుందని తెలిపారు.

ఇదీ చూడండి: 'పుదుచ్చేరి మారుతుంది.. కమలం వికసిస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.