ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్​: ఇటలీలో వాహన తనిఖీలు మరింత కఠినం

author img

By

Published : Mar 12, 2020, 8:06 AM IST

చైనా తర్వాత అత్యధిక కరోనా మరణాలు నమోదైన ఇటలీలో ఆంక్షలు మరింత కఠినతరమయ్యాయి. రాజధాని రోమ్​లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు నిబంధనలను మరింత కఠినతరం చేశారు.

Italian police are stopping cars and checking driver documents due to spread of  corona virus
కరోనా ఎఫెక్ట్​: ఇటలీలో వాహన తనిఖీలు మరింత కఠినం

ఇటలీలో కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలను తీవ్రతరం చేసింది ఆ దేశ ప్రభుత్వం. రోమ్​-వాటికన్​ ప్రాంతంలో రోడ్లపై కార్లను ఆపి తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది ఆ దేశ ప్రభుత్వం.

కాథలిక్​ చర్చి అధిపతి పోప్​ ఫ్రాన్సిస్​.. వాటికన్​లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే కొంత మందిని తన ప్రైవేట్​ లైబ్రరీలో ఉంచారు. రాష్ట్రంలో వైరస్​ వ్యాప్తిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సామాజిక సమావేశాలు, అనవరసర ప్రయాణాలపై నిషేధం విధించింది ఆ దేశ ప్రభుత్వం. అయితే.. వృత్తి రీత్యా కారణాల వల్ల బయటకు రావొచ్చని సూచించింది.

ఇప్పటివరకు ఇటలీలో 977 కొత్త కేసులు నమోదవ్వగా.. మొత్తం కేసుల సంఖ్య 10,149కు చేరింది. వైరస్​ బారినపడి 631 మంది మృతిచెందారు.

ఇదీ చదవండి: వుహాన్​లో వైరస్​ తగ్గుముఖం.. తెరుచుకోనున్న కంపెనీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.