ETV Bharat / international

'జంతు ప్రదర్శనశాలలో ఉన్నట్లుండేది' - prince harry comments on royal family

బ్రిటన్ రాజకుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రిన్స్​ హ్యరీ. రాజకుటుంబంలో తన అనుభవాన్ని జంతు ప్రదర్శనశాలలో జీవితంతో పోల్చారు. అనుక్షణం కెమెరాల నిఘాలో బతికానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

prince harry
ప్రిన్స్​ హ్యరీ
author img

By

Published : May 15, 2021, 5:41 AM IST

బ్రిటన్​ రాజకుటుంబంతో సంబంధాలు తెంచుకున్న ప్రిన్స్​ హ్యరీ మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. రాజకుటుంబంలో తన అనుభవాన్ని జంతు ప్రదర్శనశాలలో జీవితంతో పోల్చారు. 1998లో వచ్చిన 'ది ట్రూమన్​ షోలో' హీరోలా తాను కూడా అనుక్షణం కెమెరాల నిఘాలో బతికానని చెప్పుకొచ్చారు.

గతంలోనూ చాలా సార్లు రాజకుటుంబం నుంచి వీడిపోవాలన్న ఆలోచనలు తనను చుట్టుముట్టాయన్నారు. భార్య మేఘన్​, కొడుకు ఆర్చీ గురించి ఆందోళన పడేవాడినని, వారు కూడా తన తల్లి డయానాలా ఇబ్బంది పడతారేమోనన్న భయం తనును వెంటాడేదని పేర్కొన్నారు. 1997లో కారు ప్రమాదంలో డయానా చనిపోయారు. అప్పట్లో బ్రిటన్​ పత్రికల, ప్రచార సాధనాల దృష్టి ఆమెపైనే ఉండేది.

"నా తల్లికి జరిగింది చూసిన తర్వాత రాజకుటుంబ బాధ్యతలను నిర్వర్తించాలని అనిపించలేదు" అని హ్యరీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: హైవేపైనే విమానం అత్యవసర ల్యాండింగ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.