ETV Bharat / international

వ్యాక్సిన్​ తయారీ కేంద్రానికి రూ.854 కోట్లు కేటాయింపు - corona live updates

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్​ను కట్టడి చేసేందుకు భారీగా ఖర్చుచేస్తున్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సిన్​ తయారీ కోసం అవసరమయ్యే పరిశోధన కేంద్రాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది బ్రిటన్​. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించింది​ .

Indian-origin minister unveils new multi-million-pound vaccine facility in UK
వ్యాక్సిన్​ తయారీ కేంద్రానికి భారీగా నిధుల కేటాయింపు
author img

By

Published : May 18, 2020, 5:15 AM IST

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనాకు వ్యాక్సిన్​ అభివృద్ధి చేసే క్రమంలో.. బ్రిటన్​ కీలక ప్రకటన చేసింది. కొవిడ్​పై పోరులో కీలకంగా ఉపయోగపడే పరిశోధన కేంద్రం ఏర్పాటుకు దాదాపు రూ.854 కోట్లు కేటాయించింది. ఈ విషయాన్ని భారత సంతతి బ్రిటన్​ వాణిజ్యశాఖ మంత్రి అలోక్​ శర్మ ప్రకటించారు.

ఈ వ్యాక్సిన్ తయారీ, ఆవిష్కరణ కేంద్రం (వీఎంఐసీ) పూర్తయితే.. బ్రిటన్​లోని జనాభాకు ఆరు నెలల్లోగా టీకాను అందించేలా మార్గం సుగమం అవుతుందని తెలిపారు. నిర్దేశించిన సమయం కంటే 12 నెలల ముందే.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కేంద్రం ప్రారంభమయ్యేందుకు ఈ నిధులు సమకూర్చినట్లు అలోక్​ వెల్లడించారు. అంతే కాకుండా, వ్యాధి నిర్ధరణ సామర్థ్యాన్ని పెంచేలా.. దాదాపు మరో రూ.348 కోట్ల పెట్టుబడికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

"ప్రస్తుతం తాత్కాలిక సదుపాయాలతో ఉన్న వ్యాక్సిన్​ తయారీ కేంద్రాన్ని వీలైనంత త్వరగా నిర్మించి పూర్తి చేస్తాం. వ్యాక్సిన్​ ప్రయోగాన్ని ఆవిష్కరణ నుంచి పంపిణీ వరకు తీసురావాలన్నదే బ్రిటన్​ లక్ష్యం".

అలోక్​ శర్మ, బ్రిటన్​ వాణిజ్యశాఖ మంత్రి

భవిష్యత్తులో ఎలాంటి వైరస్ వ్యాపించినా.. బ్రిటన్​కు దీర్ఘకాలిక భరోసా కలిగించేలా ఈ కేంద్రం ఉపయోగపడుతుందని అలోక్​ తెలిపారు. నిధుల కేటాయింపుపై వ్యాక్సిన్​ తయారీ కేంద్ర ముఖ్య కార్యనిర్వహక అధికారి డాక్టర్​.మాథ్యూ డచర్స్​ హర్షం వ్యక్తం చేశారు.

"ఈ నిధులతో నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. సంవత్సరంలోగా కేంద్రంలో కార్యకలాపాలు ప్రారంభమయ్యేందుకు సాయపడుతుంది. సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. తద్వారా బ్రిటన్​లోని ప్రతి ఒక్కరికీ కొన్ని నెలల్లోనే తగినంత టీకా తయారు చేయవచ్చు.

మాథ్యూ డచర్స్​, వ్యాక్సిన్​ తయారీ కేంద్ర చీఫ్​ ఎగ్జిక్యూటివ్​

కరోనా లాంటి వైరస్ సమస్యలకు ధీటుగా బదులివ్వడానికి.. బ్రిటన్​కు ఈ తయారీ కేంద్రం ఓ ఆయుధంలా పనిచేస్తుందని బ్రిటన్​ రీసెర్చ్​ అండ్​ ఇన్నోవేషన్​(యూకేఆర్​ఐ) చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ మార్క్​ వాల్పోర్ట్​ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల మందికి పైగా వైరస్​కు బలయ్యారు. 40 లక్షలకు పైగా వైరస్​ కేసులు నిర్ధరణ అయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.