వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సమావేశాల సందర్భంగా సామాజిక సామర్థ్య సూచీ(సోషల్ మొబిలిటీ ఇండెక్స్) జాబితాను విడుదల చేసింది. మొత్తం 82 దేశాలున్న ఈ జాబితాలో చివరి 10 స్థానాల్లో నిలిచి 76వ ర్యాంకుతో సరిపెట్టుకుంది భారత్.
సోషల్ మొబిలిటీ అంటే?
సామాజిక ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా సమాజంలోని ప్రతిఒక్కరికీ ఒకే విధమైన అవకాశాన్ని కల్పించి వారి సామర్థ్యాలను పూర్తిగా ఉపయోగించుకునేలా చేయడమే సోషల్ మొబిలిటీ. ఇలాంటి సామాజిక వ్యవస్థను మెరుగుపరిస్తే ఆదాయ అసమానతలు తగ్గుతాయి. సామాజిక సమైక్యత పెరుగుతుంది. 2030నాటికి ప్రపంచ ఆర్థిక వృద్ధి 5 శాతం పెంచేందుకు దోహదపడుతుంది.
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు మాత్రమే సోషల్ మొబిలిటీకి అనువైన పరిస్థితులు కలిగి ఉన్నాయి. పలు కీలక అంశాల ఆధారంగా వీటిని నిర్ణయిస్తారు.
- అందరికీ అందుబాటులో ఉండేలా నాణ్యమైన, సమానమైన విద్య.
- సాంకేతిక రంగంలో అవకాశాలు, జీతాలు.
- సామాజిక రక్షణ
సోషల్ మొబిలిటిలో మొదటి ఐదు స్థానాలను ఐరోపా దేశాలే కైవసం చేసుకోవడం గమనార్హం. డెన్మార్క్ మొదటి స్థానంలో నిలవగా.. నార్వే, ఫిన్లాండ్, స్వీడన్, ఐస్లాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
సోషల్ మొబిలిటీని మెరుగుపరిస్తే అధిక ప్రయోజనం పొందే దేశాల్లో చైనా, అమెరికా, భారత్, జపాన్, జర్మనీ ముందువరుసలో ఉన్నాయి. జీ-7 దేశాల్లో జర్మనీ(11) ఉత్తమ స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఫ్రాన్స్(12) నిలిచింది.
ఇదీ చూడండి: డబ్ల్యూఈఎఫ్: స్థిరమైన ఆర్థిక ప్రపంచ సాధనే లక్ష్యం