ETV Bharat / international

గగన్​యాన్​పై సహకారం కోసం భారత్-ఫ్రాన్స్​ ఒప్పందం - ఫ్లైట్​ ఫిజీషియన్

దేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఫ్రాన్స్​తో ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా భారత ఫ్లైట్ సర్జన్లకు ఫ్రాన్స్​లో శిక్షణ లభించనుంది.

India, France,  Gaganyaan
భారత్-ఫ్రాన్స్​ ఒప్పందం, గగన్​యాన్
author img

By

Published : Apr 16, 2021, 6:14 AM IST

భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్​యాన్​ సహకారం కోసం భారత్, ఫ్రాన్స్​ అంతరిక్ష సంస్థలు గురువారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందులో భాగంగా.. భారత ఫ్లైట్​ ఫిజీషియన్లకు ఫ్రాన్స్​లో శిక్షణ అందనుంది.

ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్​ అంతరిక్ష సంస్థ సీఎన్​ఈఎస్​ అభివృద్ధి చేసి, పరీక్షించి, ప్రస్తుతం వినియోగిస్తున్న పరికరాలను భారత బృందానికి అందుబాటులో ఉంచనుంది. ఈ ఒప్పందం గురించి బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ డ్రియన్ ప్రకటన చేశారు.

మానవ అంతరిక్ష మిషన్ ప్రాజెక్టులో వ్యోమగాముల శిక్షణ చాలా కీలకం. అంతరిక్ష యాత్రకు ముందు, ప్రయాణంలో, ఆ తరువాత వ్యోమగామి ఆరోగ్యానికి ఫ్లైట్​ ఫిజీషియన్లు (లేదా సర్జన్లు) బాధ్యత వహిస్తారు. ప్రస్తుత అంతరిక్ష వైద్యులందరూ భారత వైమానిక దళానికి చెందినవారే.

ఇదీ చూడండి: 'మార్స్​ మిషన్​' సమాచారాన్ని ఇస్రోతో పంచుకున్న నాసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.