ETV Bharat / international

2002లో హత్యాచారం.. నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష - france rape news justice

హత్యాచారం కేసులో ఓ నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర ఫ్రాన్స్​లోని ఆమిన్స్ కోర్టు తీర్పునిచ్చింది. 2002లో యువతి అత్యాచారం, హత్యకు గురైన సంఘటన అప్పట్లో ఫ్రాన్స్ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో కోర్టు తాజాగా జైలు శిక్షను ఖరారు చేయగా..  భయపడిన నిందితుడు న్యాయస్థానంలోనే పురుగుల తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

In 2002 a 30 years prison sentence for murder
2002లో హత్యాచారం.. నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష
author img

By

Published : Dec 8, 2019, 7:22 PM IST

2002లో ఫ్రాన్స్​లో సంచలనంగా మారిన ఎలోడి కులిక్ అనే యువతి అత్యాచారం, హత్యకు గురైన కేసుకు సంబంధించి.. ఉత్తర ఫ్రాన్స్​లోని ఆమిన్స్ కోర్టు కీలక తీర్పును వెలువరించింది. విల్లీ బార్డాన్​ను దోషిగా తేల్చి 30 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. న్యాయస్థానం శుక్రవారం ఈ తీర్పునిచ్చిన క్షణాల్లోనే నిందితుడు పురుగుల తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు కోమాలోకి వెళ్లాడు. తిరిగి శనివారం స్పృహలోకి వచ్చాడు. అయితే విల్లీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం అతడు పోలీసుల సంరక్షణలో చికిత్స పొందుతున్నాడు.

అసలేం జరిగింది?

2002 జనవరిలో 24 ఏళ్ల ఎలోడి కులిక్​ను అపహరించి.. ఉత్తర ఫ్రాన్స్ ఇస్నేలోని టెర్​ట్రీ ప్రాంతానికి తీసుకెళ్లారు ఇద్దరు వ్యక్తులు. అత్యాచారం చేసి.. ఆమెను చంపేశారు. మృతదేహాన్ని కాల్చేశారు. అత్యాచారం సమయంలో ఎలోడి అత్యవసర సేవల విభాగానికి ఫోన్ చేసింది. ఆమె ఫోన్ కాల్ 26 సెకన్ల పాటు రికార్డయింది. ఈ సమాచారమే.. కేసును ఛేదించడంలో కీలకంగా మారింది.

ఇది విల్లీ బార్డాన్, గ్రెగోరి వియార్ట్​ల పనేనని డీఎన్​ఏ పరీక్షల ఆధారంగా గుర్తించారు పోలీసులు. ఎలోడి తండ్రి జాకీ కులిక్ పోరాటఫలితంగా కేసు విచారణ దాదాపు 17 ఏళ్లు సాగింది. ఉత్తర ఫ్రాన్స్​లోని ఆమిన్స్ కోర్టు... పూర్వాపరాలను పరిశీలించి ఇద్దరినీ దోషులుగా తేల్చింది. 30 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. తీర్పు వెలువరించిన సెకండ్ల వ్యవధిలోనే బార్డాన్ 'టెమిక్​' అనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అది అత్యంత ప్రమాదకర రసాయనం అయినందున నాడీవ్యవస్థ, గుండెపై ప్రభావం చూపింది. బార్డాన్ చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లాడు. కాగా 2003లోనే మరో దోషి.. గ్రెగోరి వియార్ట్​ చనిపోయాడు.

"సుధీర్ఘ విచారణ తర్వాత తుది తీర్పును కోర్టు వెలువరించింది. తీర్పు వచ్చిన కొన్ని సెకండ్లలోనే బార్డాన్​ ఆత్మహత్యకు యత్నించాడు. కోర్టు ఆవరణలోకి పురుగుల మందు ఎలా తెచ్చాడన్నది ఎవరికీ అంతుపట్టలేదు."

-ప్రాసిక్యూటర్ అలెగ్జాండర్ డీబోస్చేర్

తీర్పుపై ఎలోడి తండ్రి జాకీ కులిక్ స్పందిస్తూ..' కోర్టు తీర్పు నా మనసును తేలిక చేసింది. నా బిడ్డకు న్యాయం జరిగింది. ఈ విషయాన్ని నా కూతురు సమాధికి చెబుతా' అన్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New Delhi - 8 December 2019
1. Relative of one of victims crying outside mortuary, surrounded by family
2. Female relative crying as she talks on phone
3. Exterior of mortuary
4. Mid of 22-year-old Mohamad Nazir Alam, who identified bodies of five people who are from his village, talking on mobile phone, UPSOUND (Hindi) "We are not able to get information about Farid Bhai (who was working in the factory), we got to know there are other places where the dead are kept, we will go there and look for him. We have identified bodies of five that are dead: Afsar, Faisal, Sanjar, Afzal and one named Sojin, a master who used to do cutting (referring to sewing machine work). These five have died and we will now look for Farid Bhai's body."
5. Police outside mortuary
6. Sign outside mortuary reading (English) 'Mortuary, Maulana Azad Medical College'
STORYLINE:
Authorities said an electrical short circuit appeared to cause a fire that killed at least 43 people in a factory in central New Delhi early Sunday, as relatives of the victims gathered outside mortuary to identify the dead.
Firefighters had to fight the blaze from 100 meters (yards) away because it broke out in one of the area's many alleyways, tangled in electrical wire and too narrow for vehicles to access, authorities said.
Outside the mortuary, which was guarded by dozens of police officers, some of the workers' relatives said they had received phone calls from the men trapped inside, who begged them to call the fire brigade.
Many of the men were migrant workers from the impoverished border state of Bihar in eastern India, relatives said.
They earned as little as 150 rupees (2.10 US dollars) per day making handbags, caps and other garments, sleeping at the factory between lengthy shifts.
Many of the victims were asleep when the blaze began, according to Yogesh, a police spokesman who uses one name.
A case of culpable homicide not amounting to murder was registered against the building's owner, but no arrests were immediately made, Mittal said.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.