ETV Bharat / international

'టీకా వేసుకోండి.. లేకపోతే కొవిడ్​ తెచ్చుకోండి' - గ్రీస్​లో కరోనా ఆంక్షలు

జర్మనీలో కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల ప్రతీ ఒక్కరు కచ్చితంగా (Germany Coronavirus) టీకా తీసుకోవాలని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి జేన్స్ స్పాన్ కోరారు. లేకపోతే వైరస్​ సోకి మరణం తప్పదని హెచ్చరించారు.

covid vaccine
కరోనా టీకా
author img

By

Published : Nov 22, 2021, 11:49 PM IST

జర్మనీలో ప్రతీ ఒక్కరూ శీతాకాలం ముగిసేనాటికి కరోనా టీకాను తప్పనిసరిగా (Germany Coronavirus) తీసుకోవాలని ఆ దేశ ఆరోగ్య మంత్రి జేన్స్ స్పాన్​ కోరారు. లేకపోతే ఎక్కువ మంది వైరస్​ బారిన పడి చనిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఆ దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని (Germany Coronavirus) ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

సోమవారం మరో 30 వేల కరోనా కేసులు జర్మనీలో వెలుగు చూసినట్లు (Germany Coronavirus) అధికారులు తెలిపారు. కేవలం వారం రోజుల వ్యవధిలో కేసులు సంఖ్య 50 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. దేశంలో కొవిడ్​ను గుర్తించిన నాటి నుంచి వైరస్​ కారణంగా చనిపోయన వారి సంఖ్య ఈ వారంలో లక్ష మార్కును దాటుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆసుపత్రుల్లో ఐసీయూలు దాదాపు నిండిపోయినట్లు గుర్తు చేశారు. కొంతమంది రోగులను జర్మనీలోని ఇతర ప్రాంతాలలోని క్లినిక్‌లకు తరలించాల్సి ఉంటుందని చెప్పారు.

ఈ క్రమంలోనే జర్మన్లు తీవ్రమైన అనారోగ్యం తగ్గించడానికి టీకాతో పాటు బూస్టర్​ డోస్​ను కూడా తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య మంత్రి జెన్స్ స్పాన్​ కోరారు.

గ్రీస్​లో పెరుగుతున్న వైరస్​ కేసులు... ఆంక్షల అమలుకు ఉత్తర్వులు

గ్రీస్​లో భారీగా పెరుగుతున్న కరోనా మరణాలను దృష్టిలో ఉంచుకొని అక్కడి ప్రభుత్వం కొత్త ఆంక్షలను (Greece Covid Restrictions) అమలులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు డిసెంబరు 6 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. కార్యాలయాల్లో మాస్క్‌లను తప్పనిసరి చేయడం, వ్యాక్సిన్​ తీసుకున్న వారికి లేక రికవరీ అయిన వారు సర్టిఫికేట్​ను (vaccination certificate) మాత్రమే బహిరంగ ప్రదేశాలకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేసింది.

రష్యాలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు..

రష్యాలో కరోనా మరణాలు (Russia Covid Cases) గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. మరో వైపు కొత్త కేసులు నమోదు తగ్గుతుండడం ఒకింత ఉపశమనాన్ని ఇచ్చిన.. మరణాలు మాత్రం ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఇదీ చూడండి: కొవాగ్జిన్ వేసుకున్నవారికి యూకే అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.