పర్యవరణ కార్యకర్త గ్రెటా థెన్‌బర్గ్... కరోనాపై పోరుకు లక్ష డాలర్ల భారీ విరాళం ప్రకటించారు. హ్యూమెన్ యాక్ట్ అనే స్వచ్ఛంధ సంస్థ తనకు ఇచ్చిన లక్ష డాలర్లను యూనిసెఫ్‌కు బదలాయిస్తున్నట్టు గ్రెటా తెలిపారు. కరోనా సంక్షోభం ప్రస్తుతం పిల్లలపై పెను ప్రభావం చూపిస్తోందన్న గ్రెటా... దీర్ఘ కాలంలో బలహీన వర్గాలన్నీ దీని బారినపడతాయని వ్యాఖ్యానించారు.
వాతావరణ మార్పుల మాదిరిగానే కరోనా మహమ్మారి కూడా బాలల హక్కుల సంక్షోభానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. పిల్లల సంరక్షణకు తోడ్పడుతున్న యూనిసెఫ్‌కు ప్రపంచ వ్యాప్తంగా విరాళాలు అందించాలని కోరారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో చిన్నారుల చదువుల్ని, ఆరోగ్యాల్ని, కాపాడేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని గ్రెటా పిలుపునిచ్చారు.