ETV Bharat / international

'కరోనా నుంచి క్రమంగా కోలుకోవచ్చు' - dexamethason

కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ వైరస్​ నుంచి కోలుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ). బ్రిటన్​ శాస్త్రవేత్తలు కనుగొన్న జనరిక్​ ఔషధం డెక్సామెథసోన్​పై ప్రశంసలు కురిపించింది డబ్ల్యూహెచ్​ఓ). అయితే ఆ ఔషధాన్ని కేవలం వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలని సూచించింది.

'Green shoots of hope' in pandemic: WHO
'డెక్సామెథాసోన్​తో కరోనా నుంచి కోలుకుంటాం'
author img

By

Published : Jun 18, 2020, 12:59 PM IST

Updated : Jun 18, 2020, 2:19 PM IST

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్​-19 కేసులు పెరుగుతున్నప్పటికీ కరోనా నుంచి కోలుకుంటామని... ఆశాభావం వ్యక్తం చేశారు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్. బ్రిటన్ శాస్త్రవేత్తలు కనుగొన్న 'డెక్సమెథసోన్‌' జనరిక్‌ ఔషధం కరోనా రోగుల్లో వైరస్​ తీవ్రతను తగ్గిస్తున్నట్లు ప్రాథమిక ప్రయోగాల్లో నిరూపితమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) కూడా దీనిని ధ్రువీకరించింది.

ఈ ఔషధాన్ని వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలని డబ్ల్యూహెచ్​ఓ సూచించింది. కాగా తీవ్ర అనారోగ్యానికి గురైన రోగులు కోలుకోవడానికి ఇస్తున్న ఈ జనరిక్ ఔషధం... వైరస్​కు మందు మాత్రం కాదని హెచ్చరించారు డబ్ల్యూహెచ్ఓ హెల్త్​ ఎమర్జెన్సీ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్​ మైఖేల్​ ర్యాన్​.

వైరస్​ ప్రబలిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 80 లక్షలకు పైగా కొవిడ్​-19 బారిన పడగా.. 4 లక్షలపైగా మృతి చెందారని జాన్స్​​ హాప్కిన్స్​ విశ్వవిద్యాలయం తెలిపింది. అయితే కరోనా పరీక్షలు జరగకుండా చనిపోయినవారిని లెక్కలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ఇదీ చూడండి: కరోనా రోగులకు ప్రాణదాతగా మారిన ఔషధం!

Last Updated : Jun 18, 2020, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.