ETV Bharat / international

కరోనా పంజా.. కోటీ 95 లక్షలు దాటిన కేసులు

ప్రపంచంపై కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్​ ధాటికి వివిధ దేశాల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, బ్రెజిల్​, భారత్​, రష్యా సహా పలు దేశాల్లో మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కేసుల్లో స్పెయిన్​ను వెనక్కి నెట్టి తొమ్మిదోస్థానానికి చేరుకుంది కొలంబియా. మొత్తం కేసుల సంఖ్య కోటీ 95 లక్షలు దాటింది. 7. 24లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

Global COVID-19 tracker
కరోనా పంజా.. కోటీ 95 లక్షల దాటిన కేసులు
author img

By

Published : Aug 8, 2020, 6:45 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహా విలయం కొనసాగుతోంది. రోజూ కొత్తగా 3 లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. జనాభా అధికంగా ఉన్న దేశాలతో పాటు చిన్న చిన్న దీవుల్లోనూ వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వైరస్​ కట్టడి అయినట్లు ప్రకటించుకున్న దేశాల్లోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి.

  • మొత్తం కేసులు: 19,573,743
  • మరణాలు: 724,723
  • కోలుకున్నవారు: 12,568,981
  • యాక్టివ్​ కేసులు: 6,280,039

అమెరికాలో..

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే కేసులు 50 లక్షలు దాటాయి. లక్షా 64 వేల మంది వైరస్​కు బలయ్యారు. ఆంక్షలు సడలించి.. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో వైరస్​ బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది.

బ్రెజిల్​లో..

కేసుల సంఖ్యలో రెండో స్థానంలో కొనసాగుతోంది బ్రెజిల్​. రోజుకు 50 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్య 30 లక్షలకు చేరువైంది. దాదాపు లక్ష మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

సింగపూర్​లో 55వేలు..

సింగపూర్​లో వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్తగా మరో 132 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 55వేల మార్కుకు చేరువైంది. కొత్తగా వైరస్​ బారిన పడుతున్న వారిలో అధికంగా విదేశాలకు చెందిన కూలీలే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో సామాజిక వ్యాప్తి ప్రారంభం కాలేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 48,297 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

పాక్​లో మరో 842 కేసులు

పాకిస్థాన్​లో కరోనా వైరస్​ విజృంభిస్తోంది. శనివారం మరో 842 మంది వైరస్​ బారిన పడ్డారు. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 2.83 లక్షలు దాటింది. ఇప్పటి వరకు 6,068 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,59,604 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

స్పెయిన్​ను వెనక్కి నెట్టిన కొలంబియా..

కరోనా మహమ్మారి ఉద్ధృతితో కేసుల సంఖ్యలో కొలంబియా దూసుకెళుతోంది. స్పెయిన్​ను వెనక్కినెట్టి తొమ్మిదోస్థానానికి చేరింది. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 3.67 లక్షలకు చేరాయి. స్పెయిన్​లో ఈ సంఖ్య 3.61 లక్షలుగా ఉంది. అయితే మరణాల పరంగా స్పెయిన్​ కన్నా చాలా దూరంలో ఉండటం ఊరట కలిగించే విషయం.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల వివరాలు..

దేశంకేసులుమరణాలు
అమెరికా5,096,443164,130
బ్రెజిల్2,967,064 99,702
రష్యా882,34714,854
దక్షిణాఫ్రికా 545,4769,909
మెక్సికో 469,40751,311
పెరు 469,40751,311
చిలీ368,825 9,958
కొలంబియా367,19612,250
స్పెయిన్361,44228,503

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.