ETV Bharat / international

బ్రెజిల్​ను కుదిపేస్తున్న కరోనా.. ఒక్కరోజే 11వేల కేసులు

కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ప్రపంచదేశాల్లో ఇప్పటివరకు 2 లక్షల 64 వేల మందికిపైగా బలి తీసుకుంది ఈ మహమ్మారి. మరో 38 లక్షల 18 వేల మందికి వైరస్​ సోకింది. దాదాపు 13 లక్షల మంది కోలుకున్నారు. ఇటలీలో మరణాలు మరోసారి పెరగ్గా.. స్పెయిన్​, ఫ్రాన్స్​లో కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. బ్రిటన్​లో మళ్లీ ఒక్కరోజే 600కుపైగా మరణాలు సంభవించాయి. బ్రెజిల్​లో వైరస్​ ఉద్ధృతి అంతకంతకూ పెరిగిపోతోంది.

Global COVID-19 tracker
ప్రపంచవ్యాప్తంగా 38 లక్షలు దాటిన కరోనా కేసులు
author img

By

Published : May 7, 2020, 6:57 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ విలయతాండవం చేస్తోంది. కేసులు, మరణాల్లో రోజుకో తీరు కనిపిస్తోంది. ఐరోపా దేశాల్లోని స్పెయిన్​, ఫ్రాన్స్​లో మరోసారి ఒక్కరోజే 3 వేలకుపైగా కొత్త కేసుల నమోదయ్యాయి. ఇక్కడ వరుసగా 244, 278 మంది మరణించారు. ఈ రెండు దేశాల్లో మొత్తం మృతుల సంఖ్య(25 వేల 800కుపైగా) దాదాపు సమానమే.

అమెరికాలో మరో 25 వేలకుపైగా కేసులు నమోదవగా... మొత్తం బాధితుల సంఖ్య 12 లక్షల 63 వేలు దాటింది. ఇందులో 2 లక్షల 12 వందల మందికిపైగా కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 74 వేలను అధిగమించింది.

ఇటలీలో గడిచిన 24 గంటల్లో 369 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1400కుపైగా వైరస్​ బారినపడ్డారు.

బ్రిటన్​లో తీవ్రం...

యూకేలో కరోనా ఉద్ధృతి పెరిగిపోతోంది. మరోమారు అక్కడ ఒక్కరోజు మరణాలు 600 దాటాయి. మరో 6 వేలకుపైగా బాధితులు కొత్తగా చేరారు. దేశంలో మొత్తం మరణాలు 30 వేలను అధిగమించాయి.

  • బ్రెజిల్​లో 24 గంటల వ్యవధిలో 645 మంది చనిపోయారు. కొత్తగా 11 వేలకుపైగా కేసులు వెలుగులోకివచ్చాయి.
  • జర్మనీలో ఒక్కరోజులో 282, కెనడాలో 189, బెల్జియంలో 323 మరణాలు సంభవించాయి.
  • రష్యాలో మొత్తం కేసులు లక్షా 65 వేలు దాటాయి. మరో 10 వేలకు పైగా కొత్త బాధితులు చేరగా.. ఇప్పటివరకు దేశంలో 1537 మంది మరణించారు.
  • ఇరాన్​లో ఇప్పటివరకు 6,418 మంది కొవిడ్​కు బలయ్యారు. బుధవారం.. 1680 మందికి వైరస్​ సోకింది.
  • మెక్సికోలో నిన్న 236 మంది చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 2,507కు చేరింది.

పాకిస్థాన్​లో మరో 30 మంది మరణించారు. కొత్తగా 1165 కేసులు నమోదయ్యాయి.

సింగపూర్​లో మరో 788 మందికి వైరస్​ సోకింది. మొత్తం మరణాల సంఖ్య 20కి చేరింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.