జర్మనీలోని దక్షిణ వుర్జ్‌బర్గ్ నగరంలో శుక్రవారం ఓ సాయుధుడు 40 సెంటీమీటర్ల పొడవైన కత్తి(తల్వార్)తో ముగ్గుర్ని హత్య చేశాడు. మరికొందర్ని తీవ్రంగా గాయపరిచాడు. నగరంలోని ప్రధాన కూడలిలో జరిగిన ఈ దాడిలో ఎంత మంది గాయపడ్డారో స్పష్టంగా తెలియరాలేదని అధికారులు చెప్పారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తిని వుర్జ్‌బర్గ్‌లో నివసిస్తున్న 24 ఏళ్ల సోమాలిగా పోలీసులు గుర్తించారు.
అమాయకులపై కత్తితో దాడి చేసే సందర్భంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడికి స్వల్పంగా గాయపడినట్లు అక్కడి అధికారులు పేర్కొన్నాయి. దాడి చేసే సమయంలో అతన్ని ఆపేందుకు అక్కడే ఉన్న పలువురు ఫోన్లు ఇతర వస్తున్నలు అతనిపై విసిరారని.. అయినప్పటికీ దాడి ఆపలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
నిందితుడు మానసిక అనారోగ్యానికి సంబంధించి చికిత్స పొందాడని.. ఈ ఘటన ఉగ్రవాద చర్యా? కాదా? అనేది తెలియాల్సి ఉందని బవేరియన్ రాష్ట్ర అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి జోచిమ్ హెర్మాన్ వివరించారు. బాధితులకు నిందితుడితో వ్యక్తిగత సంబంధాలు ఉన్నట్లు ఆధారాలేమీ లభించలేదని హెర్మాన్ తెలిపినట్లు జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
ఇవీ చదవండి: