ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ గుర్తించిన కారణంగా నాలుగు వేల పందులను వధించాలని ఓ పందుల పెంపక కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే వాటిని వధించడం ప్రారంభించింది. ఈ ఘటన ఉత్తర జర్మనీలోని గెస్ట్రోలో జరిగింది. ఈ వైరస్ను గత వారం గుర్తించిన అధికారులు.. ఈ ప్రాంతంలో వైరస్ ఎలా వచ్చిందనే విషయంపై స్పష్టత లేదన్నారు.
మరోవైపు డెన్మార్క్.. జర్మనీ నుంచి ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు చేపడుతోంది.
ఇటీవల ఐరోపా దేశాల్లో వ్యాప్తి చెందిన ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ మనుషులపై ఎలాంటి ప్రభావం చూపదని నిపుణులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి : భారత్కు కొరకరాని కొయ్యగా జిన్పింగ్!