ETV Bharat / international

జర్మనీకి చెందిన 60లక్షల మాస్కులు కెన్యాలో మాయం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇతర దేశాల నుంచి తాము దిగుమతి చేసుకుంటున్న దాదాపు 6 మిలియన్ల మాస్క్​లు కెన్యాలో మాయమైనట్లు జర్మనీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

German army loses 6 million masks in Kenya
జర్మనీకి చెందిన 60లక్షల మాస్కులు కెన్యాలో మాయం
author img

By

Published : Mar 24, 2020, 10:59 PM IST

Updated : Mar 25, 2020, 12:00 AM IST

కరోనా ప్రభావిత దేశాల్లో జర్మనీ ఒకటి. రోజు రోజుకు వైరస్​ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ దేశంలో మాస్కు​ల కొరత ఏర్పడింది. ఈ సమస్య అధిగమించేందుకు ఇతర దేశాల నుంచి మాస్కు​లను దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలో దాదాపు 6 మిలియన్ల మాస్కులు.. కెన్యాలో అదృశ్యమయ్యాయి. ఈ విషయాన్ని ఆ దేశ రక్షణ మంత్రిత్వశాఖ ధ్రువీకరించింది.

మాస్కు​లు అదృశ్యమవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆ దేశ అధికార ప్రతినిధి తెలిపారు.

గతవారమే..

గత వారమే కెన్యా విమానాశ్రయంలో ఈ మాస్కు​లు అదృశ్యమైనట్లు స్థానిక మీడియా తెలిపింది. కరోనా వైరస్​తో ఇప్పటికే అవస్థలు పడుతున్న ప్రభుత్వానికి ఈ మాస్క్​లు మాయం కావడం మరింత ఆందోళనకు గురి చేస్తున్నట్లు ఓ మ్యాగజైన్​ కథనాన్ని ప్రచురించింది. మాస్కులకు సంబంధించి ఎటువంటి చెల్లింపులు చేయనందున ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు.

జర్మనీ వ్యాప్తంగా మొత్తం 27,436 కరోనా కేసులు నమోదైనట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి:'దేశదేశాలు తిరిగి సేవచేస్తుంటే అవమానిస్తారా?'

Last Updated : Mar 25, 2020, 12:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.