ETV Bharat / international

WHO Chief: డబ్ల్యూహెచ్​ఓ అధినేతగా మరోసారి టెడ్రోస్! - సౌమ్య స్వామినాథన్

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్​గా (WHO Chief) మరోసారి టెడ్రోస్ అధనోమ్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. రెండో దఫా ఎన్నిక కోసం టెడ్రోస్‌ పేరునే తాము నామినేట్‌ చేసినట్లు జర్మనీ, ఫ్రాన్స్‌ తెలిపాయి.

who chief
డబ్ల్యూహెచ్ఓ
author img

By

Published : Sep 25, 2021, 7:10 AM IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ (WHO Chief) వరుసగా రెండోసారి ఆ పదవికి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో దఫా ఎన్నిక కోసం ఆయన పేరును తాము నామినేట్‌ చేసినట్లు జర్మనీ, ఫ్రాన్స్‌ వెల్లడించాయి. ఐరోపా సమాఖ్య (ఈయూ)లోని మరో 15 దేశాలూ ఆయనకు మద్దతు ప్రకటించినట్లు సమాచారం.

టెడ్రోస్‌ డబ్బూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌గా (WHO Chief Tedros) 2017లో బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగుతారు. వచ్చే ఏడాది మేలో డబ్ల్యూహెచ్‌వో వార్షిక సమావేశాల్లో తదుపరి అధినేతను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకోసం నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. టెడ్రోస్‌ పేరునే తాము నామినేట్‌ చేసినట్లు జర్మనీ, ఫ్రాన్స్‌ తెలిపాయి.

సొంత దేశమే చేయలేదు..

మరోవైపు టెడ్రోస్‌ స్వదేశమైన ఇథియోపియా నుంచి ఆయన పేరును రెండో దఫా పదవీ కాలానికి నామినేట్‌ చేయలేదు. ఇథియోపియా ప్రధాన మంత్రి అబియ్‌ అహ్మద్‌తో టెడ్రోస్‌కు ఉన్న విభేదాలే ఇందుకు కారణం.

'చిన్నారులకు ముప్పు లేదు'

చిన్నారులపై కొవిడ్ మహమ్మారి తీవ్రత తక్కువేనని అన్నారు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ సైంటిస్ట్ (WHO Chief Scientist) సౌమ్యస్వామినాథన్. వ్యాధి సోకినా వారు కోలుకునే అవకాశం చాలా ఎక్కువని తెలిపారు. అయితే కరోనా వైరస్​ ఇప్పట్లో (Soumya Swaminathan on Covid) అంతరించిపోకున్నా.. రెండేళ్లుగా చూపించిన ప్రభావం, భయాందోళనలు ఉండబోవని చెప్పారు.

ఇదీ చూడండి: 'కొవాక్స్​'కు టీకాల సరఫరా- భారత్​పై డబ్ల్యూహెచ్​ఓ ప్రశంసలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.