ETV Bharat / international

ఒక్కరోజే 3.81 లక్షల కేసులు- ఫ్రాన్స్​లో కర్ఫ్యూ

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 3.81 లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫ్రాన్స్​లో కరోనాను అరికట్టేందుకు రాత్రి కర్ఫ్యూ విధించారు. నాలుగు వారాల పాటు కర్ఫ్యూ కొనసాగనున్నట్లు అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించారు. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 81 లక్షలు దాటిపోయింది.

france-announces-curfew-amid-second-wave-of-covid-19-cases
ఒక్కరోజే 3.81 లక్షల కేసులు- ఫ్రాన్స్​లో కర్ఫ్యూ
author img

By

Published : Oct 15, 2020, 7:49 AM IST

ఫ్రాన్స్​లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులను అరికట్టేందుకు కర్ఫ్యూ విధించారు. పారిస్ సహా మొత్తం ఎనిమిది నగరాల్లో ఆంక్షలు విధిస్తున్నట్లు అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్ ప్రకటించారు.

శనివారం మొదలుకొని నాలుగు వారాల పాటు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల మధ్య కర్ఫ్యూ కొనసాగనుంది.

ఫ్రాన్స్​లో తాజాగా 22,591 కేసులు బయటపడ్డాయి. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 7,79,063కు చేరింది. బుధవారం 104 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 33 వేలు దాటింది.

ఒక్కరోజే 3.81 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం రికార్డు స్థాయిలో 3.81 లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 87 లక్షల 30,280కి చేరింది. మరో ఆరు వేల మరణాలతో మృతుల సంఖ్య లక్షా తొంభై ఆరు వేలకు చేరింది.

ఇజ్రాయెల్​లో కొత్తగా 1,848 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 2.98 లక్షలకు చేరుకుంది. మరో 43 మరణాలు సంభవించాయి. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 2,098కి చేరింది.

అమెరికాలో బయటపడ్డ 59,693 కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 81 లక్షలు దాటిపోయింది. ఒక్కరోజే 970 మంది మరణించారు. మరణాల సంఖ్య 2.21 లక్షలకు పెరిగింది.

పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...

దేశంకేసులుమరణాలు
అమెరికా81,50,0432,21,843
బ్రెజిల్51,41,4981,51,779
రష్యా13,40,40923,205
స్పెయిన్9,37,31133,413
అర్జెంటీనా9,31,96724,921
కొలంబియా9,30,15928,306
పెరూ8,56,95133,512
మెక్సికో8,29,39684,898
ఫ్రాన్స్7,79,06333,037

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.