ఐరోపాలో ఫైజర్ టీకాపై తొలిసారిగా ప్రతికూల ప్రభావం ఎదురైంది. తమ దేశంలో ఈ తరహా కేసు నమోదైందని ఫిన్లాండ్ మెడిసిన్స్ ఏజెన్సీ(ఎఫ్ఎంఏ) ఓ ప్రకటనలో తెలిపింది.
వైరస్ వ్యాప్తిని నివారించేందుకు గత నెల 27న ఈయూ సభ్యదేశాలు టీకా పంపిణీ చేపట్టగా.. వారం రోజుల అనంతరం ఇలా ప్రతికూల స్పందన రావడం గమనార్హం. ఇలాంటి కేసులు కనీసం 5 నమోదైన అనంతరం ఈ వ్యవహారంపై మరిన్ని విషయాలను వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి రోగి గోప్యత కారణంగా పూర్తి వివరాలను వెల్లడించలేమని స్పష్టం చేశారు. మరోవైపు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అలర్జీ, ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఫిన్లాండ్లో ఇప్పటివరకు 5 జిల్లాల్లోని ప్రధాన ఆస్పత్రులలో.. ఆరోగ్య కార్మికులకు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్టు సమాచారం.
ఇదీ చదవండి: 'వారానికి 2 మిలియన్ల వ్యాక్సిన్ డోసులు'