ETV Bharat / international

Pegasus spyware: 'అదే నిజమైతే ఎర్రగీత దాటినట్లే' - పెగాసస్ నిఘా వ్యవస్థ

పెగాసస్(Pegasus spyware) వ్యవహారంపై ఐరాస మానవహక్కుల హైకమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. మానవ హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వాలు ఇలాంటి నిఘా సాంకేతికతను ఉపయోగించడం మానుకోవాలని అన్నారు. సమాజ పురోగతిలో ప్రధాన పాత్ర పోషించే జర్నలిస్టులు, మానవ హక్కుల పరిరక్షకుల నోళ్లను మూసే ప్రయత్నం చేస్తే అందరూ ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.

UNHR PEGASUS
పెగాసస్
author img

By

Published : Jul 20, 2021, 10:37 AM IST

రాజకీయ నాయకులు, జర్నలిస్ట్​లు, మానవహక్కుల పరిరక్షకులపై నిఘా వేసేందుకు ప్రభుత్వాలు పెగాసస్(Pegasus spyware) స్పైవేర్​ను ఉపయోగించడం పట్ల ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. గోప్యతను ఉల్లంఘిస్తూ ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను.. ఐరాస మానవ హక్కుల హైకమిషనర్ మిచెల్ బాచ్లెట్(Michelle Bachelet) కోరారు. మానవహక్కులకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వాలు స్వయంగా ఇలాంటి నిఘా సాంకేతికతను ఉపయోగించడం మానుకోవాలని అన్నారు.

"రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, మానవ హక్కుల పరిరక్షకులపై పెగాసస్ సాఫ్ట్​వేర్​ను ఉపయోగించినట్లు బయటకు రావడం ఆందోళకరం. ప్రజల మానవహక్కులను తక్కువ అంచనా వేస్తూ నిఘా సాంకేతికతలను దుర్వినియోగం చేస్తున్నారన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తోంది. నిఘా పరికరాలను అధికార యంత్రాంగాలు ఉపయోగించడం వల్ల తలెత్తే ప్రమాదాల గురించి ఐరాస మానవహక్కుల సంఘం వివిధ వేదికలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉంది. తాజాగా వచ్చిన ఆరోపణలు పాక్షికంగా నిజమని తేలినా.. ఎర్రగీత దాటినట్లే."

-మిచెల్ బాచ్లెట్, ఐరాస మానవ హక్కుల సంఘం హైకమిషనర్

జర్నలిస్టులు, మానవ హక్కుల పరిరక్షకులు సమాజ పురోగతిలో ప్రధాన పాత్ర పోషిస్తారని బాచ్లెట్ పేర్కొన్నారు. వారి నోళ్లను మూసే ప్రయత్నం చేస్తే అందరూ ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. చట్టబద్ధమైన లక్ష్యంతో, తప్పనిసరైన పరిస్థితుల్లో మాత్రమే నిఘా వ్యవస్థలను ఉపయోగించాలని ప్రభుత్వాలకు హితవు పలికారు. మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకునే బాధ్యత నిఘా వ్యవస్థలను అభివృద్ధి చేసే సంస్థలపైనా ఉందని అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.