పేద దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి నిధులు అందజేయాలని ఐరోపా ప్రభుత్వాలతో పాటు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అభ్యర్థించాయి. ఇందుకు అవసరమైన వందల కోట్ల డాలర్లను అందించాలని ప్రపంచ దేశాలను కోరాయి.
వ్యాక్సిన్ అభివృద్ధి, పంపిణీని సమన్వయం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ రూపొందించిన 'యాక్ట్' కార్యక్రమానికి ఈ నిధులు చేరుతాయి. ప్రపంచంలోని పేద ప్రజలకు వ్యాక్సిన్లు అందజేసేందుకు ఈ కార్యక్రమాన్ని డబ్ల్యూహెచ్ఓ ప్రారంభించింది.
ఇప్పటికే ఫ్రాన్స్, ఐరోపా సమాఖ్య చెరో 11.8 కోట్ల డాలర్లు అందిస్తామని హామీ ఇచ్చారు. స్పెయిన్ 5.9 కోట్ల డాలర్లు, గేట్స్ ఫౌండేషన్ 5.93 కోట్ల డాలర్లు అందజేయనున్నారు. జర్మనీతో పాటు ఇతర ఐరోపా దేశాలు కూడా నిధులు సమకూరుస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: కరోనా కొత్త సవాల్.. మరో జీవిలోకి వైరస్