ETV Bharat / international

'బ్రెగ్జిట్​'పై చర్చల్లో ఈయూ, బ్రిటన్​ విఫలం! - బ్రిటన్, ఈయూ వాణిజ్య ఒప్పందం

నార్తన్​ ఐర్లాండ్​లో వాణిజ్య నియమాలపై ఐరోపా సమాఖ్య, బ్రిటన్​ల మధ్య గురువారం జరిగిన చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ అంశంపై రానున్న రోజుల్లో మరిన్ని చర్చలు జరుపుతామని ఇరు దేశాలు తెలిపాయి.

brexit
బ్రెగ్జిట్​
author img

By

Published : Apr 16, 2021, 5:29 PM IST

ఐరోపా సమాఖ్య(ఈయూ)​, బ్రిటన్​ ఉన్నతాధికారులు.. నార్తన్​ ఐర్లాండ్​లో వాణిజ్య నియమాలపై జరిపిన చర్చల్లో విఫలమయ్యారు. తద్వారా.. రానున్న రోజుల్లోనూ ఈ అంశంపై చర్చలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ మేరకు ఐరోపా​ కమిషన్​ ఉపాధ్యక్షుడు మారోస్​ సఫ్కోవిక్​, బ్రిటన్​ బ్రెగ్జిట్​ మంత్రి డేవిడ్​ ఫ్రోస్ట్​ గురువారం సాయంత్రం సమావేశమయ్యారు.

బ్రెగ్జిట్​ ఒప్పందంలో నిబంధనలు బ్రిటన్ గౌరవించటం ​లేదని, అంతర్జాతీయ న్యాయసూత్రాలను ​ఉల్లంఘిస్తోందనే ఆరోపణలతో ఈయూ న్యాయ చర్యలు చేపట్టిన నెలరోజుల తర్వాత ఈయూ, బ్రిటన్​ ఉన్నతాధికారుల మధ్య ఈ భేటీ జరగటం గమనార్హం. అయితే.. నార్తన్​​ ఐర్లాండ్​లో వాణిజ్య నియమాలకు సంబంధించి రాబోయే వారాల్లో జరిగే చర్చల్లో తాము ఏకాభిప్రాయానికి వస్తామని డేవిడ్​ ఫ్రోస్ట్​ పేర్కొన్నారు.

అసలేంటి సమస్య..

ఐర్లాండ్​ ద్వీపంలోని ఓ భాగమే ఈ నార్తన్ ఐర్లాండ్. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ బయటకు వచ్చాక ఈ రెండు ప్రదేశాల మధ్య సరిహద్దు సమస్యలు తలెత్తాయి. రెండు ప్రాంతాలు ఒకటి ఐరోపా సమాఖ్యలో మరొక ప్రాంతం యూకేలో ఉంటుంది. దీంతో యూకేకు, నార్తన్ ఐర్లాండ్​కు మధ్య వాణిజ్యానికి సంబంధించి అనిశ్చితి నెలకొంది.

ఇదీ చూడండి:బ్రెగ్జిట్ వాణిజ్య​ ఒప్పందంతో భారత్​కు లాభమెంత?

ఇదీ చూడండి:బ్రెగ్జిట్​ సరే... ఇప్పుడు యూకే నుంచి దేశాలు ఎగ్జిట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.