ETV Bharat / international

ఆస్ట్రాజెనెకా టీకా సురక్షితమే: ఐరోపా సమాఖ్య

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​కు, రక్తం గడ్డ కట్టడానికి ఎలాంటి సంబంధం లేదని ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. ఈ టీకా సురక్షితమని.. కొవిడ్-19 నుంచి రక్షించేందుకు సమర్థంగా పనిచేస్తుందని తెలిపింది. ఈయూ దేశాలు తిరిగి ప్రజలకు టీకా అందించే దిశగా అడుగులు వేయాలని సూచించింది.

EU agency: AstraZeneca vaccine safe, will add clot warning
'ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సమర్థవంతం, సురక్షితం'
author img

By

Published : Mar 19, 2021, 12:38 AM IST

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​పై ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రాజెనెకా టీకాకు, రక్తం గడ్డకట్టడానికి ఎలాంటి సంబంధం లేదని తమ పరిశోధనలో తేలిందని వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా టీకా పంపిణీని నిలిపివేసిన ఈయూ దేశాలు.. తిరిగి ప్రారంభించాలని సూచించింది.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​పై ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ తీసుకునే నిర్ణయం కోసమే తాము ఆగినట్లు జర్మనీ, ఫ్రాన్స్​ తెలిపాయి.

"మా సాంకేతికత ప్రకారం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్​ సురక్షితమైనది. కరోనాపై ఈ టీకా సమర్థంగా పనిచేస్తుంది. నేనే గనుక ఈ వ్యాక్సిన్​ తీసుకోవాలి అనుకుంటే.. రేపే తీసుకుంటాను."

-- ఎమర్​ కూక్, ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ అధికారి

ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారికి రక్తంలో సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో.. వ్యాక్సిన్​​ పంపిణీని ఈయూలోని చాలా దేశాలు తాత్కాలికంగా నిలిపివేశాయి.

ఇదీ చదవండి : 'ఆస్ట్రాజెనెకా టీకాతో రక్తంలో సమస్యలకు ఆధారాల్లేవ్​'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.