ETV Bharat / international

'రానున్న రోజుల్లో ప్రమాదకారిగా డెల్టా వైరస్' - Tedros adhanom

భారత్​లో అత్యధికంగా వ్యాపించిన కరోనా డెల్టా రకం వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో ఈ వేరియంట్​ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది.

WHO, delta variant
డబ్ల్యూహెచ్​ఓ, డెల్టా వేరియంట్
author img

By

Published : Jul 1, 2021, 12:47 PM IST

కొవిడ్-19 డెల్టా వేరియంట్​ రానున్న రోజుల్లో అత్యంత ప్రమాదకారిగా మారనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రస్తుతం దాదాపు 100కు పైగా దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపించిందని తెలిపింది.

జూన్​ 29 కల్లా 96 దేశాల్లో ఈ వేరియంట్​ వ్యాపించినట్లు నిర్ధరించిన డబ్ల్యూహెచ్​ఓ.. దీని కారణంగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడించింది.

"రానున్న రోజుల్లో ఇతర వేరియంట్ల కన్నా.. డెల్టా వేరియంట్​ ప్రభావం తీవ్రంగా ఉంటుంది."

--ప్రపంచ ఆరోగ్య సంస్థ.

అయితే.. ఈ ప్రమాదకర వేరియంట్​ను సైతం కొవిడ్​ నిబంధనలతో అరికట్టవచ్చని డబ్ల్యూహెచ్​ఓ సూచించింది. వ్యాక్సినేషన్​ ప్రక్రియ నెమ్మదిగా ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తత అవసరమని పేర్కొంది.

ఇదీ చదవండి:'డెల్టా' వేరియంట్లు​​ అత్యంత​ ప్రమాదకరమా?

"వ్యాక్సిన్​ తీసుకోని వారిలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుంది. కొన్ని దేశాల్లో కొవిడ్​ నిబంధనలను పూర్తిగా సడలించారు. దీని వల్ల డెల్టా వేరియంట్​ ప్రభావం మరింతగా ఉండొచ్చు. ఇది ప్రమాదకారి​ అని డబ్ల్యూహెచ్​ఓ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది."

--టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్​ఓ డైరెక్టర్ జనరల్.

ఏ వేరియంట్ ఎన్ని దేశాల్లో?

  • ఆల్ఫా వేరియంట్-172 దేశాలు
  • బీటా వేరియంట్-120 దేశాలు(కొత్తగా మరో దేశంలో)
  • గామా వేరియంట్-72 దేశాలు(కొత్తగా మరో దేశంలో)
  • డెల్టా వేరియంట్-96 దేశాలు(కొత్తగా 11 దేశాల్లో)

జూన్ 21-27 మధ్య

ఈ వ్యవధిలో బ్రెజిల్​లో అత్యధికంగా 5,21,298 కొవిడ్ కేసులను నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. భారత్​లో 3,51,218 మందికి వైరస్​ సోకినట్లు తెలిపింది. తర్వాతి స్థానాల్లో కొలంబియా(2,04,132), రష్యా(1,34, 465), అర్జెంటినా(1,31,824) ఉన్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.