ETV Bharat / international

నోబెల్​ వేడుకపైనా కరోనా ప్రభావం- విందు రద్దు - traditional December banquet

కరోనా ప్రభావం డిసెంబరులో జరగబోయే నోబెల్​ బహుమతి వేడుకలపై పడినట్లు తెలుస్తోంది. అవార్డు ప్రదానోత్సవంలో భాగంగా డిసెంబరులో జరగనున్న సంప్రదాయ విందును రద్దు చేసినట్లు నిర్వహకులు తెలిపారు.

December Nobel Prize banquet in Sweden cancelled
నోబెల్​ బహుమతి సంప్రదాయ విందు రద్దు
author img

By

Published : Jul 22, 2020, 4:08 PM IST

ప్రతిష్టాత్మక నోబెల్​ బహుమతుల ప్రదానోత్సవంలో భాగంగా స్వీడన్​ రాజధాని స్టాక్​హోం సిటీ హాల్‌లో డిసెంబరులో జరగనున్న సంప్రదాయ విందును రద్దు చేసినట్లు నోబెల్​ ఫౌండేషన్ తెలిపింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

సాధ్యం కాదు!

ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో 1300 మంది అతిథులను పిలిచి... విందు నిర్వహించడం సాధ్యం కాదని నోబెల్ ఫౌండేషన్ సీఈఓ లార్స్​ హైకెన్‌స్టెన్​ అన్నారు. విజేతలు స్వీడన్‌కు వెళ్లడంపై కూడా అనిశ్చితి నెలకొన్నట్లు చెప్పారు​.

"మహమ్మారి కారణంగా నోబెల్ వేడుకలు యథావిధిగా జరగవు. ప్రతి ఒక్కరూ త్యాగాలు చేసి పూర్తిగా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండాల్సిన ప్రత్యేకమైన సంవత్సరం ఇది.

-లార్స్​ హైకెన్‌స్టెన్, నోబెల్ ఫౌండేషన్ సీఈఓ

ఇదీ చూడండి: 'చైనా కాన్సులేట్​ మూసివేతకు అమెరికా ఆదేశం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.