స్పెయిన్‌లో గ్లోరియా తుపాను ధాటికి 11 మంది మృతి చెందగా... మరో నలుగురు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. గాలుల వేగానికి ఇళ్లతో సహా అనేక హోటళ్లు దెబ్బతిన్నాయి. తూర్పు స్పెయిన్‌లో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. భారీ వర్షాలు కురిశాయి.
ఈ వర్షాల కారణంగా ఐరోపాలోని పర్యటక ప్రదేశాలు.. తీరప్రాంతాలా దెబ్బతిన్నాయి. మరికొన్ని పట్టణాల్లో వరదలు సంభవించాయి.
తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ప్రధాని పెడ్రో శాంచెజ్ పర్యటించారు. తక్షణమే ప్రభుత్వ సాయం అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. అధికార యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.
2018లో మల్లోర్కాలోని హాలిడే ద్వీపంలో సంభవించిన వరదలకు 13 మంది మరణించారు.
ఇదీ చదవండి: 'పాక్ ప్రధాని' వార్తలు చూడట్లేదట.. ఎందుకు?