ETV Bharat / international

ఆ మిశ్రమ డోసుల ప్రభావం ఎక్కువే! - కొవిషీల్డ్‌, ఫైజర్‌ టీకాలు కలిపి వాడితే అనర్థమా?

కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​తో పాటు.. అమెరికాకు చెందిన ఫైజర్​ టీకాను కలిపి తీసుకుంటే ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

covishield and pfizer
కొవిషీల్డ్‌, ఫైజర్‌ కలిస్తే అదరహో
author img

By

Published : Jul 1, 2021, 8:40 AM IST

కొవిషీల్డ్‌, ఫైజర్‌ టీకాల మిశ్రమ డోసులు కరోనా నివారణలో ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తాయని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజా అధ్యయనంలో తేల్చారు. ఈ రెండింటిలో ఒక టీకాను తొలి డోసుగా, మరోదాన్ని రెండో డోసుగా స్వీకరించినప్పుడు వ్యక్తులకు బలమైన రోగ నిరోధక సామర్థ్యం చేకూరుతుందని నిర్ధారించారు.

మొత్తం 830 మందిపై పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారందరి సగటు వయసు 57.8 ఏళ్లు. కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులను తీసుకున్న వ్యక్తులతో పోలిస్తే.. నాలుగు వారాల వ్యవధిలో ఒక డోసుగా కొవిషీల్డ్‌ను, మరో డోసుగా ఫైజర్‌ను వేసుకున్నవారిలో కొవిడ్‌ కారక సార్స్‌-కొవ్‌-2 వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌కు వ్యతిరేకంగా ఎక్కువ యాంటీబాడీలు ఉత్పన్నమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. రెండు వ్యాక్సిన్లలో దేన్ని తొలి డోసుగా తీసుకున్నా ఫర్వాలేదని స్పష్టం చేశారు.

అయితే- మొదట ఫైజర్‌ను, తర్వాత కొవిషీల్డ్‌ను వేసుకున్నవారికంటే.. తొలుత కొవిషీల్డ్‌ను, ఆపై ఫైజర్‌ను తీసుకున్నవారిలో యాంటీబాడీలు, టీ-సెల్‌ స్పందనలు మరింత అధికంగా ఉంటున్నాయని తెలిపారు.

ఇవీ చదవండి:

కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌.. రెండిట్లో ఏది బెటర్?

డెల్టా రకంపై కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ భేష్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.