ETV Bharat / international

కొవిషీల్డ్​ను యూకే ఆమోదించినా.. క్వారంటైన్​లోనే భారత ప్రయాణికులు!

బ్రిటన్ విదేశీ ప్రయాణికుల ట్రావెల్ అడ్వైజరీలో స్పష్టత కొరవడింది. కొవిషీల్డ్ తీసుకున్న ప్రయాణికులకు క్వారంటైన్ అవసరం లేదని తాజాగా పేర్కొన్నప్పటికీ.. ఇందులో భారత్ పేరును ప్రస్తావించలేదు. ఈ వ్యవహారంపై స్పందించిన అధికారులు సమస్య కొవిషీల్డ్​ గురించి కాదని, భారత ప్రభుత్వం జారీ చేస్తున్న ధ్రువపత్రాల గురించి అని తెలిపారు.

uk travel restrictions
కొవిషీల్డ్​కు యూకే ఆమోదం
author img

By

Published : Sep 22, 2021, 1:59 PM IST

Updated : Sep 22, 2021, 7:12 PM IST

విదేశీ ప్రయాణికుల కోసం బ్రిటన్ తీసుకొచ్చిన కొవిడ్ నిబంధనల్లో అస్పష్టత వీడలేదు. టీకా తీసుకున్నప్పటికీ భారత ప్రయాణికులకు క్వారంటైన్ తప్పనిసరి చేసిన అక్కడి ప్రభుత్వం... మోదీ సర్కారు అభ్యంతరంతో వీటిని తాజాగా సవరించింది. కొవిషీల్డ్ డోసులు తీసుకున్నవారికి క్వారంటైన్ మినహాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, బ్రిటన్​లోకి అనుమతించే విదేశీ ప్రయాణికుల జాబితాలో భారత్ పేరును ప్రస్తావించలేదు. కొవిషీల్డ్ తీసుకున్న వారికి ఆంక్షలు మినహాయించినప్పటికీ.. భారత్​లో ఈ టీకాను తీసుకున్నవారు మాత్రం యథావిధిగా 10 రోజుల పాటు క్వారంటైన్​లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

uk travel restrictions
విదేశీ ప్రయాణికులకు బ్రిటన్​ అమలు చేయనున్న కొవిడ్‌ నిబంధలు

మొత్తం 17 దేశాల ప్రయాణికుల కోసం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన యూకే.. అందులో భారత్​ పేరును ప్రస్తావించలేదు. యూకే వైద్య శాఖ సైతం దీనిపై వివరణ ఇవ్వలేదు. స్పష్టమైన ప్రకటన కోసం మరిన్ని వివరాలు పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ధ్రువపత్రం గుర్తింపు ఎలా...?

మరోవైపు, దీనిపై స్పందించిన బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి.. భారత్​తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వం జారీ చేసే టీకా ధ్రువపత్రాన్ని గుర్తింపు ఇచ్చే విషయంపై చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. బ్రిటన్ వచ్చే భారత ప్రయాణికులు టీకా తీసుకోని వారికి విధించిన నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.

మరోవైపు, సమస్య కొవిషీల్డ్ గురించి కాదని, భారత ప్రభుత్వం జారీ చేసే టీకా ధ్రువపత్రాల గురించేనని అధికారులు తెలిపారు. దీనిపై భారత్, బ్రిటన్ అధికారులు చర్చిస్తున్నారని చెప్పారు.

అడ్వైజరీపై వివాదం

అక్టోబరు 4వ తేదీ నుంచి విదేశీ ప్రయాణికులకు అమలు చేసే కొవిడ్‌ నిబంధలను బ్రిటన్‌ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. దాని ప్రకారం భారత్‌, మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కొవిషీల్డ్‌ రెండు డోసుల టీకా తీసుకున్నప్పటికీ వారిని టీకా తీసుకోనివారిగానే పరిగణిస్తామని పేర్కొంది. ఆ దేశాల నుంచి వచ్చే వారు.. తమ ప్రయాణానికి ముందుగా, యూకేకు చేరుకున్న తర్వాత పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలి. పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలి. అయితే ఈ నిబంధనల పట్ల కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జైరామ్‌ రమేశ్‌, శశిథరూర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రిటన్‌ నిబంధనలు జాతి వివక్ష చూపేలా ఉన్నాయని, ఇది పూర్తిగా నేరపూరిత చర్యేనని మండిపడ్డారు.

అనంతరం భారత విదేశాంగ శాఖ సైతం తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా 'వివక్షపూరితమైన విధానం' అని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని, లేదంటే ప్రతిచర్య తప్పదని హెచ్చరించింది.

ఇదీ చూడండి: us covishield: 'కొవిషీల్డ్‌ తీసుకున్నవారికే అమెరికాలోకి అనుమతి'

Last Updated : Sep 22, 2021, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.