ETV Bharat / international

కొవిడ్​తో మెదడులో 'మ్యాటర్'పై ఎఫెక్ట్ - కొవిడ్‌తో తగ్గుతోన్న గ్రే మ్యాటర్

కరోనా నుంచి కోలుకున్నవారి మెదడులో గ్రే మ్యాటర్​ తగ్గిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. పక్షవాతం లాంటి సమస్యలకు ఇది దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.

Covid can cause loss of brain grey matter
కొవిడ్‌తో తగ్గుతోన్న గ్రే మ్యాటర్
author img

By

Published : Jun 20, 2021, 5:43 AM IST

Updated : Jun 20, 2021, 7:15 AM IST

కొవిడ్‌-19 నుంచి కోలుకున్నవారిలో మెదడులో గ్రే మ్యాటర్‌ తగ్గిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వారి స్కాన్లను పరిశీలించినప్పుడు ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. కొవిడ్‌ కేవలం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ కాదని, కొందరిలో ఇది మెదడుపైనా ప్రభావం చూపుతుందని ఇప్పటికే జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది. పక్షవాతం, డిమెన్షియా వంటి సమస్యలకు ఇది దారితీయవచ్చని అధ్యయనాలు తేల్చాయి. తాజాగా గ్రే మ్యాటర్‌ కూడా తగ్గిపోతోందని వెల్లడైంది.

మెదడులో సమాచారాన్ని ప్రాసెస్‌ చేయడంలో గ్రే మ్యాటర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. తద్వారా వ్యక్తులు తమ కదలికలు, జ్ఞాపకశక్తి, భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు. గ్రే మ్యాటర్‌లో లోపాల వల్ల నాడీ కణాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థల పనితీరుపై ప్రభావం పడుతుంది.

మెదడులోకి కొవిడ్?

బ్రిటన్‌లోని 'బయో బ్యాంక్‌' నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు.. కొవిడ్‌ బాధితుల్లో గ్రే మ్యాటర్‌ తగ్గుతున్నట్లు గుర్తించారు. కొవిడ్‌కు ముందు, ఆ తర్వాత వారి మెదడుకు తీసిన స్కాన్లను పోల్చడం ద్వారా దీన్ని నిర్ధారించారు. మెదడులో వాసన, రుచి, జ్ఞాపకశక్తికి సంబంధించిన ప్రాంతాల్లో గ్రే మ్యాటర్‌ తగ్గుతున్నట్లు తేల్చారు. ఈ మార్పులన్నీ మెదడులోకి కొవిడ్‌ వ్యాధి లేదా వైరస్‌ వ్యాప్తిని సూచిస్తున్నాయా అన్నది తేల్చేందుకు పరిశోధనలు చేయాల్సిన అవసరముందని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇదీ చూడండి: మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కరోనా దెబ్బతీస్తుందా?

Last Updated : Jun 20, 2021, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.