కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే రేసులో ముందంజలో ఉంది బ్రిటన్. ఆక్స్ఫర్డ్ వర్సిటీ, బ్రిటిష్ స్వేడిష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందిస్తోన్న కరోనా వ్యాక్సిన్ మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా.. యూకేలోని 18 సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్ తొలి డోసు అందుతుందని ఓ నివేదిక తెలిపింది.
ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ .. వేగంగా ప్రయోగాలు పూర్తి చేసుకుంటోంది. ఈ ఏడాదిలోనే అధికారిక ధ్రువీకరణతో వ్యాక్సిన్ విడుదల కానుందని.. కేవలం ఆరు నెలల్లోనే ప్రపంచంలోని ప్రతి పౌరుడికి ఓ డోసు అందుతుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.
ఇప్పటికే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ విడుదలకు అనుమతులు జారీ చేసేందుకు... ఐరోపా ఔషధ సంస్థ(ఈఎంఏ) వివరాలను పరిశీలిస్తోంది. భారతీయ సీరం సంస్థతో అనుసంధానమైన ఆస్ట్రాజెనెకా.. దేశంలోనూ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేసి దేశవ్యాప్తంగా 1,600 డోసులు ప్రయోగించనుంది.
ఇదీ చదవండి: కళకళలాడే కశ్మీర్ అందాల్లో 'పాంపోర్' కుంకుమపువ్వు