యువత, నడివయసువారితో పోలిస్తే 65ఏళ్లు పైబడినవారికి కరోనా ఇన్ఫెక్షన్ మరోసారి తలెత్తే ప్రమాదం ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది. డెన్మార్క్‌లోని స్టాటెన్స్ సీరం ఇన్స్టిట్యూట్ ఈ పరిశోధన చేసింది. ఒకసారి కొవిడ్-19 బారినపడిన వారికి రెండోసారి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా కనీసం కొన్ని నెలలు రక్షణ లభించొచ్చన్న అంచనాలు ఉన్నాయి. 65 ఏళ్లు లోపువారికి రీఇన్ఫిక్షన్ ముప్పు నుంచి దాదాపు 80 శాతం మేర రక్షణ లభిస్తోందని డెన్మార్క్ శాస్త్రవేత్తలు వివరించారు.
65ఏళ్లు పైబడిన వారిలో ఆ రక్షణ 47 శాతమే ఉంటోందని పేర్కొన్నారు. దీన్నిబట్టి వారు తిరిగి కొవిడ్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపారు. కాబట్టి గతంలో ఒకసారి కరోనా బారినపడిన వారు కూడా టీకాను పొందాలని పరిశోధకులు సూచించారు.
ఇదీ చదవండి : కరోనా విజృంభణపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ