ETV Bharat / international

కరోనా వైరస్​తో వినికిడిపైనా ప్రభావం! - కరోనా వైరస్​ ప్రభావం

కొవిడ్​-19తో వినికిడి కోల్పోయే ప్రమాదం ఉందా? అంటే అవునంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే అరుదుగా మాత్రమే అలా జరుగుతుందని తెలిపారు. బ్రిటన్​కు చెందిన లండన్​ యూనివర్సిటీ కాలేజ్​కు చెందిన శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో ఈ విషయాలను పేర్కొన్నారు.

hearing loss
కొవిడ్​తో వినికిడిపైనా ప్రభావం
author img

By

Published : Oct 15, 2020, 9:41 AM IST

కరోనా మహమ్మారి కారణంగా అనేక ఇతర దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. తాజాగా కొవిడ్​తో వినికిడి కోల్పోయే ప్రమాదం ఉందని బ్రిటన్​కు చెందిన లండన్​ యూనివర్సిటీ కాలేజ్​ శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీరు వినికిడిపై కరోనా వైరస్​ కలిగించే ప్రభావంపై అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా వీరు బ్రిటన్​లోని రాయల్​ నేషనల్​ చెవి, ముక్కు ఆసుపత్రిలో కొవిడ్​-19 చికిత్స కోసం చేరిన 45 ఏళ్ల వ్యక్తి కేసును ఉదహరించారు.

శ్వాస తీసుకోవడంలో బాధిత వ్యక్తి ఇబ్బంది పడ్డారు. దీంతో వైద్యులు ఇంటెన్సివ్​ కేర్​ యూనిట్​కు తరలించారు. వెంటిలేటర్​పై 30 రోజులు ఉంచారు. తర్వాత ఆ వ్యక్తి కోలుకున్నారు. అయితే అతని ఎడమచెవి వినికిడి శక్తిని కోల్పోయింది. చెవిని పరీక్షించారు. ఎక్కడా అవరోధాలు లేవు. ఎందుకు జరిగిందో వైద్యులకు అర్థం కాలేదు. తర్వాత స్థెరాయిడ్​ మాత్రలు, ఇంజెక్షన్లు ఇచ్చారు. పాక్షికంగా మళ్లీ వినికిడి శక్తి వచ్చింది. అతనికి ఫ్లూ, హెచ్​ఐవీ టెస్టులు చేశారు, నెగెటివ్​ ఫలితాలే వచ్చాయి. దీంతో కొవిడ్​-19 కారణంగానే వినికిడి శక్తి పోయిందన్న నిర్ధరణకు వైద్యులు వచ్చారు.

" కొవిడ్​ కారణంగా తలెత్తే అనేక దుష్పరిణామాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. వినికిడి శక్తిపై వైరస్​ కలిగించే ప్రభావంపై అంతగా జరగడం లేదు. కొవిడ్​, ఇన్​ఫ్లుయింజా రోగుల్లో వినికిడి శక్తి కోల్పోతున్న రోగులను చూస్తున్నాం. ఈ నేపథ్యంలో దీనిపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది." అని లండన్​ యూనివర్సిటీ కాలేజ్​ పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: కరోనాకు రష్యా రెండో వ్యాక్సిన్ రెడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.