ETV Bharat / international

కరోనా 'కొత్త' షాక్​- బ్రిటన్​తో కనెక్షన్​ కట్​ - latest international news

బ్రిటన్​లో కరోనా కొత్త రకం స్ట్రెయిన్​​ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. జర్మనీ, ఇటలీ వంటి దేశాలు ఇప్పటికే సరిహద్దులు మూసివేయగా.. ఇప్పుడు ఆ జాబితాలో ఫ్రాన్స్ కూడా చేరింది. భారత్​ సహా పలు దేశాలు బ్రిటన్​ నుంచి వచ్చే విమానాలపై నిషేధాజ్ఞలు విధించాయి. పరిస్థితి భయానకంగా మారిందని, ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.

Countries begin to seal off UK amid new coronavirus variant surge
కరోనా కొత్త స్ట్రెయిన్​ భయం- బ్రిటన్​తో కనెక్షన్​ కట్​
author img

By

Published : Dec 21, 2020, 4:48 PM IST

కరోనా కొత్త రకం స్ట్రెయిన్​ బ్రిటన్​లో ఉప్పెనలా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. జర్మనీ, ఇటలీ, బెల్జియం, డెన్మార్క్​, బల్గేరియా, టర్కీ, కెనడా వంటి దేశాలు ఇప్పటికే సరిహద్దులు మూసివేసి అప్రమత్తమయ్యాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో ఐరోపా దేశం ఫ్రాన్స్ చేరింది. పలు దేశాలు ముందు జాగ్రత్త చర్యగా బ్రిటన్​ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి.

  • కరోనా కొత్త స్ట్రెయిన్​ కారణంగా బ్రిటన్​వ్యాప్తంగా కఠిన లాక్​డౌన్​ అమలు చేస్తోంది ప్రభుత్వం. అత్యవసరం మినహా అన్ని రకాల ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండేలా నిబంధనలు అమలు చేస్తోంది.
  • హాంగ్​కాంగ్, ఇజ్రాయెల్​, ఇరాన్​, క్రొయేషియా, అర్జెంటీనా, చిలీ, మొరాకో, కువైట్​ వంటి దేశాలు బ్రిటన్​పై ప్రయాణ ఆంక్షలు విధించాయి.
  • భారత్​ కూడా బ్రిటన్ విమాన రాకపోకలపై డిసెంబర్ 31 వరకు నిషేధం విధించింది.
  • ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర కమిటీతో సోమవారం సమావేశం కానున్నారు బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​. ప్రస్తుత పరిస్థితిని సమీక్షించనున్నారు.
  • బ్రిటన్​లో ఒక్కరోజే 35వేలకు పైగా కొత్త రకం కరోనా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఐరోపా సమాఖ్య సభ్య దేశాలు కూడా మరింత అప్రమత్తమయ్యాయి. త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి వైరస్​ను​ కట్టడి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నాయి.
  • దేశంలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉందని బ్రిటన్ ఆరోగ్య కార్యదర్శి మ్యాట్​ హ్యాంకాక్ ఆందోళన వ్యక్తం చేశారు. టైర్​-4 లాక్​డౌన్​ అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం శత విధాలా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త రకం కరోనా స్ట్రెయిన్​ను కట్టడి చేయడం అత్యంత క్లిష్టతరమని చెప్పారు.
  • కొత్త రకం కరోనా ఎంత ప్రమాదకరమో ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని , అయితే అది అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతుందని మాత్రం గుర్తించినట్లు లండన్​లోని ఇంపీరియల్​ కాలేజ్​కు చెందిన నిపుణులు డా.ఎరిక్​ వాయిజ్​ తెలిపారు.
  • ఉత్తర్​ ఐర్లాండ్ మినహా బ్రిటన్​ మొత్తం కరోనా కొత్త స్ట్రెయిన్​ వ్యాప్తి చెందుతోంది.
  • ప్రభుత్వం ఆంక్షల కారణంగా ఇంగ్లాండ్​, వేల్స్​లోని 2.1కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసర సేవలు మినహా అన్నింటిపై ఆంక్షలు విధించారు. టైర్-4 ఆంక్షలు అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు.. క్రిస్​మస్​ వేళ కూడా తమ ఇళ్లలో మరొకరికి ఆతిథ్యం ఇవ్వడానికి వీల్లేదు.
  • బోరిస్ జాన్సన్​ అసమర్థత కారణంగానే ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి నెలకొందని ప్రతిపక్ష లేబర్​ పార్టీ నేత కీర్​ స్టార్మర్​ విమర్శించారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

ఇదీ చూడండి: బ్రిటన్​ నుంచి భారత్​కు విమానాలు బంద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.