ETV Bharat / international

ఈ ఏడాది ఎక్కువగా వాడిన పదం.. 'కరోనావైరస్' - టైం పదాన్ని దాటేసి అధికంగా వాడిన పదాల జాబితాలో కరోనా వైరస్

కొత్త కేసులు, మరణాలతోనే కాకుండా 'కరోనావైరస్' మరో రికార్డును నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు అత్యధికంగా వాడిన పదాల్లో 'కరోనా వైరస్' ఒకటిగా నిలిచినట్లు ఆక్స్​ఫర్డ్ లాంగ్వేజెస్ సంస్థ తెలిపింది. ఈ పదం ఏకంగా ప్రతి ఏటా ఎక్కువగా వినియోగించే 'టైం'ను కూడా దాటేసినట్లు వెల్లడించింది.

most frequently used nouns in English this Year is Corona virus
2020లో అత్యధికంగా ఉపయోగించిన పదం కరోనా వైరస్
author img

By

Published : Nov 24, 2020, 5:34 AM IST

ఈ ఏడాదిలో ఏప్రిల్ నాటికి ఆంగ్లంలో అత్యధికంగా ఉపయోగించిన నామవాచకాల్లో 'కరోనావైరస్' ఒకటని ఆక్స్​ఫర్డ్ లాంగ్వేజెస్ సంస్థ తెలిపింది. ఏటా ఉపయోగించే 'టైం' పదాన్ని కూడా ఇది అధిగమించందని ఆ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఏడాదికిగాను కరోనావైరస్​తో పాటు దానికి సంబంధించిన మరి కొన్ని కొత్త పదాల వినియోగం కూడా కనీవినీ ఎరుగని రీతిలో పెరిగిందని తెలిసింది.

దీనితో ఏటా అత్యధికంగా ఉపయోగించిన నామవాచకాన్ని చేర్చే 'వర్డ్ ఆఫ్ ది ఇయర్' ప్రక్రియలో మార్పులు చోటుచేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. సాధారణంగా ఒక ఏడాదిలో అత్యధికంగా ఉపయోగించిన ఆంగ్ల పదాన్ని ఇందులో చేర్చుతుంది. కానీ ఒకటికి మించి ఎక్కువ నామవాచకాలు ఈ రేసులో ఉండటం ఇదే మొదటిసారి అని అభిప్రాయపడింది. భారత్​లో 'ఈ-పాస్' పదాన్ని ఎక్కువగా వినియోగించారని అధ్యయనంలో తేలింది.

1960లలోనే కరోనావైరస్ పదం వినియోగం..

1960లలో కూడా కరోనావైరస్ పదాన్ని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ఉపయోగించారని, కానీ తరచూ వినియోగించడం ఈ ఏడాదిలోనే జరిగిందని నివేదిక తెలిపింది. ఏప్రిల్ తర్వాత ఆ స్థానాన్ని కొవిడ్-19 ఆక్రమించిందని పేర్కొంది. భౌతిక దూరం(సోషల్ డిస్టెన్స్), లాక్ డౌన్, వర్క్ ఫ్రం హోం, కీవర్కర్స్, సపోర్ట్ బబుల్.. వంటి పదాల వినియోగం అనూహ్యంగా పెరిగిందని అందులో తెలిపింది. ఆన్​లైన్ సమావేశాలు కూడా అధికమైనందున 'మ్యూట్', 'అన్ మ్యూట్' పదాలను ఎక్కువగా ఉపయోగించారని తేలింది.

ఇదీ చూడండి:చైనాలోని ఆ మూడు నగరాల్లో మళ్లీ కరోనా వ్యాప్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.