ETV Bharat / international

వుహాన్​లో హడావుడిగా వ్యాక్సినేషన్​ - Sputnik V corona vaccine

బ్రిటన్ సహా పలు దేశాల్లో కొత్త కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మిగిలిన దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ క్రమంలో వుహాన్​లో కరోనా టీకా అత్యసవర వినియోగ కార్యక్రమాన్ని ప్రారంభించింది చైనా. మరోవైపు ఇరాన్​ అభివృద్ధి చేస్తున్న టీకాను.. మనుషులపై ప్రయోగించనున్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు.

China kicks off emergency COVID-19 vaccination in Wuhan
కరోనా పుట్టింట్లో టీకాలు- మనుషులపై ఇరాన్ టీకా!
author img

By

Published : Dec 29, 2020, 5:40 PM IST

కరోనా వైరస్ పుట్టినిల్లుగా భావిస్తున్న వుహాన్ నగరంలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది చైనా ప్రభుత్వం. ప్రమాదం పొంచి ఉన్న కొన్ని వర్గాల ప్రజలకు అత్యవసరంగా టీకాలు అందజేస్తున్నామని అక్కడి వైద్యాధికారులు మీడియాకు వెల్లడించారు.

"18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న కొన్ని వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని వుహాన్‌ యంత్రాంగం ఈ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 24 నుంచే దీన్ని మొదలుపెట్టింది. అందుకోసం 15 జిల్లాల్లోని 48 క్లినిక్‌లను ఎంపిక చేసింది. నాలుగు వారాల వ్యవధితో రెండు టీకా డోసులను తీసుకోవాల్సి ఉంటుంది" అని వుహాన్ వైద్యాధికారి వివరించారు.

మరో దేశంలో 'స్పుత్నిక్​' టీకా

రష్యా అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్​ వీ' టీకాను తమ దేశ ప్రజలకు అందించనున్నట్లు ప్రకటించింది బెలారస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ​. దీంతో స్పుత్నిక్​ టీకాను వినియోగంలోకి తీసుకురానున్న రెండో దేశంగా అవతరించనుంది బెలారస్​. అయితే ఈ వ్యాక్సిన్​ సమర్థత, భద్రతపై ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతున్నాయి.

మనుషులపై ఇరాన్ టీకా ప్రయోగం

దేశీయంగా తయారు చేసిన కరోనా టీకాను మనుషులపై ప్రయోగించనున్నట్లు ఇరాన్​ తెలిపింది. ఈ టీకాను షిఫా ఫార్మెడ్ రూపొందించినట్లు వెల్లడించారు ఆ దేశ అధికారులు.

ఇదీ చూడండి: నేపాల్ ప్రతిపక్ష నేతలతో చైనా మంతనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.