ETV Bharat / international

పాశ్చాత్య యువత 'మద్యానికి' దూరం.. ఏంటీ మార్పు?

Changes in young generation: 'భవిష్యత్​పై భయం లేదని, బాధ్యతలను గుర్తించడం లేదని' ఈ కాలం యువతపై పెద్దలు చేసే ఫిర్యాదులు ఎన్నో? కానీ ఇటీవల యువతలో మార్పు వచ్చిందంటోంది ఓ అధ్యయనం. తాగుడు వ్యసనం బాగా తగ్గి.. తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడుతున్నాయని చెబుతోంది. భవిష్యత్​పై ఆందోళనతో తమ జీవితాలను చక్కదిద్దుకుంటున్నారని తెలిపింది.

CHANGES IN YOUNG GENERATION
పాశ్చాత్య యువత 'మద్యానికి' దూరం
author img

By

Published : Dec 26, 2021, 7:11 AM IST

Changes in young generation: 'సహస్రాబ్ది తరం'.. 'మిలీనియం జనరేషన్‌'గా పిలుచుకొనే ఈ కాలంలోని యువత నిజంగా మరో యుగం దూతలే. నూతన భావాలతో పాటు బాధ్యతలను ఇంట, ఒంట పట్టించుకున్న యువతరం. స్పష్టమైన ఆలోచనలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్న నవతరం. చేతిలో బీరు సీసా లేకుండా హ్యాపీ న్యూ ఇయర్‌ ఏమిటీ అని అనుకొనే రకం కాదు. మద్యపానం వ్యసనమే తప్ప, ఆనందం కలిగించదని గుర్తించి దానికి దూరమవుతున్న కొత్త తరం. ఇదే వయసులో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులతో పోల్చితే ఇప్పటివారిలో తాగుడు వ్యసనం బాగా తగ్గింది. ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, బ్రిటన్‌, నార్వే, ఫిన్‌లాండ్‌ వంటి పాశ్చాత్య దేశాల్లోని యువతపై లా ట్రోబ్‌, షెఫీల్డ్‌, స్టాక్‌హోం విశ్వవిద్యాలయాల పరిశోధకులు జరిపిన సర్వేలో ఈ ఆశ్చర్యకరమైన ఫలితం వెల్లడయింది. ఈ సహస్రాబ్ది ప్రారంభం నుంచే ఈ మార్పు కనిపిస్తుండడం విశేషం.

Millennials drinking habits

యువతలో తాగుడు వ్యసనం తగ్గడానికి ప్రభుత్వాలు అమలు చేసిన విధానాలేవీ కారణం కాదు. విస్తృతమైన సాంఘిక, సాంస్కృతిక, సాంకేతిక, ఆర్థిక మార్పులే దోహదం చేశాయి. పరిశోధకులు ప్రధానంగా నాలుగు కారణాలను గుర్తించారు.

  1. భవిష్యత్తుపై అస్పష్టత, తద్వారా కలిగిన ఆందోళన
  2. ఆరోగ్యంపై అవగాహన
  3. సాంకేతిక రంగం, విశ్రాంతిల్లో మార్పులు
  4. అన్నింటికన్నా ముఖ్యంగా తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడడం...

Millennials developed countries

మునుపటితో పోల్చితే అభివృద్ధి చెందిన దేశాల్లో పరిస్థితులు మారాయి. తమ భవిష్యత్తు భద్రమేమీ కాదని యువత గుర్తించింది. కెరీర్‌ను ఎంచుకోవడం నుంచి ఇల్లును సమకూర్చుకోవడం వరకూ అన్నీ సులభమైన వ్యవహారాలేమీ కావు. చిన్నతనం నుంచే చదువుల ఒత్తిడి పెరిగింది. జీవితంపై అదుపు ఉన్నప్పుడే లక్ష్యాలను నెరవేర్చుకోగలమన్న ఆలోచన అంకురించింది. మునుపటి తరాలకు ఈ బాధ, బెడద ఏమీ ఉండేది కాదు. టీనేజీ నుంచి యువతరానికి మారే సంధికాలంలో మందు కొట్టడం 'ఆచారం'గా ఉండేది. ఇప్పుడు మాత్రం సాధ్యమైనంత త్వరగా బాధ్యతాయుత, స్వతంత్ర జీవితంలో ప్రవేశించాలని యువత ఆశిస్తోంది. తాగుడుకు అలవాటు పడితే ఈ లక్ష్యం దెబ్బతింటుందని భావించి అందుకు దూరంగా ఉంటోంది. భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించడం అంటే మందు పార్టీలకు ధనం, కాలాన్ని వెచ్చించకపోవడమే.

Generation Y characteristics

1990లలో అప్పటి యువత 'తప్పతాగడాన్ని' ఆస్వాదించేది. ఇందువల్ల జరిగే నష్టాలంటే వాంతులు చేసుకోవడం, ఒళ్లు తెలియకుండా పడిపోవడం వంటివేనని చెప్పేది. ఇప్పటివారు దీర్ఘకాలంలో శరీరంతో పాటు, మనసుపై పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. అందుకే మద్యపానం చేయకూడదని భావిస్తున్నారు. స్వీడన్‌, ఆస్ట్రేలియా యువత మాత్రం సామాజిక సంబంధాల దృష్ట్యా అప్పుడప్పుడు కాస్త పుచ్చుకుంటే మంచిదేనని అభిప్రాయపడ్డారు.

సామాజిక మాధ్యమాల భయం

నూతన సాంకేతిక పరిజ్ఞానం కూడా యువతలో మార్పునకు కారణమయింది. ఇప్పుడు ఏ చిన్న పార్టీ జరిగినా దాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టడం అలవాటుగా మారింది. తాగుతున్న ఫొటోలు పెడితే ప్రస్తుత యజమానులు, భవిష్యత్తు యజమానులు, తల్లిదండ్రులు, స్నేహితులు ఏమనుకుంటారో అన్న భయం యువతలో నెలకొంది. పాత తరానికి ఇలాంటి బాధలేవీ ఉండేవి కావు. కాలక్షేపానికి పార్టీలు చేసుకునే వారు. ఇంటర్నెట్‌లోనే సమయం గడిపే అవకాశం ఉండడంతో ఇప్పటి యువత పార్టీలవైపు ఆసక్తి చూపడం లేదు.

బలపడుతున్న కుటుంబ బంధాలు

గతంలోలేని విధంగా కుటుంబ బంధాలు బలపడుతున్నాయి. పిల్లలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారన్నదాన్ని తల్లిదండ్రులు తమ మొబైళ్ల ద్వారా పరిశీలిస్తున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రులతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఎదిరించడం కూడా తగ్గింది. సమస్యల నుంచి 'చల్లబడడానికి' మందుకొట్టాలన్న భావనా క్రమేణా తగ్గుతోంది. తప్పతాగడం తప్పన్న అభిప్రాయం బలపడింది. ఈ విషయంలో మహిళలు మరింత జాగ్రత్తగా ఉంటున్నారు. తాగి అందరి దృష్టిలో పడకూడదని గట్టిగా చెబుతున్నారు. సంప్రదాయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే భారత్‌లో మాత్రం అందుకు విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి!

ఇదీ చదవండి: అంతరిక్ష చిక్కుముళ్లు విప్పేందుకు నింగిలోకి దూసుకెళ్లిన మహా విశ్వదర్శిని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.